Lav Agarwal about Corona second wave: న్యూ ఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా తగ్గలేగని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ హెచ్చరించారు. దేశంలో కరోనావైరస్ మహమ్మారి ఇప్పుడప్పుడే అంతం అయ్యేలా లేదన్న లవ్ అగర్వాల్.. సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా పోలేదని స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా 44 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా అధికంగా ఉంది. దక్షిణాదిన కేరళతో పాటు మణిపూర్, మిజోరం, నాగాలాండ్ లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు అధికంగా ఉన్నట్లు లవ్ అగర్వాల్ (Lav Agarwal) తెలిపారు.
Also read : కరోనా నుంచి రక్షణకు వ్యాక్సిన్ బూస్టర్ డోసు అనివార్యమేనా
ప్రపంచవ్యాప్తంగా ఇంకా భారీ మొత్తంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని గుర్తుచేసిన లవ్ అగర్వాల్.. భారత్‌లోనూ కరోనా సెకండ్ వేవ్ ఇంకా తగ్గలేదని అన్నారు. జూన్ 1 నాటికి 100 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలు 279 ఉండగా ప్రస్తుతం అవి 57 కి తగ్గాయని అగర్వాల్ తెలిపారు. తాజాగా కేరళలోని 10 జిల్లాలతో పాటు మొత్తం 18 జిల్లాల్లో కరోనావైరస్ పాజిటివ్ కేసులు (Corona second wave) పెరుగుతున్నాయని వెల్లడించారు.
Also read : ఏపీ కరోనా వైరస్ కేసుల్లో గణనీయంగా తగ్గుదల, నైట్ కర్ఫ్యూ రెండు వారాలు పొడిగింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook