New farm laws would be withdrawn has been welcomed: వివాదాస్పదంగా మారిన నూతన సాగు చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గటంపై విపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని ప్రకటించడాాన్ని(Modi on New Farm laws).. వివిధ రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలు ఇది ముమ్మాటికి రైతులు సాధించిన విజయమేనని పేర్కొన్నారు. దాదాపు ఏడాది కాలంగా అలుపెరుగని పోరాటం చేసిన రైతులు అనుకున్నది సాధించారని చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సత్యాగ్రహం ద్వారా సాధించారు..


'సత్యాగ్రహంతో దేశ అన్నదాతలు.. అహకార ప్రభుత్వ తల వంచారు. అన్యాయానికి వ్యతిరేకంగా ఈ విజయం సాధించినందుకు అభినందనలు.! జై హింద్​, జై హింద్​ కా కిసాన్​.' అని కాంగ్రెస్ కీలకనేత రాహుల్​ గాంధీ (Rahul Gandhi on New farm laws withdrawn) ట్వీట్ చేశారు.



ముందే చేసి ఉంటే వారి ప్రాణాలు దక్కేవి..


నూతన సాగు చట్టాలను ముందే రద్దు చేసి ఉంటే.. 700 మంది రైతుల ప్రాణాలు దక్కేవ్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్​. ఇప్పటికైనా వాటిని రద్దు చేయడం వల్ల వారి ప్రాణ త్యాగానికి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.


ఇది ముమ్మాటికి రైతులు, ప్రజాస్వామ్య సాధించిన విజయమని స్పష్టం చేశారు (Aravind Kejriwal on New farm laws withdrawn) అరవింద్ కేజ్రివాల్​.
రైతులు తమ ప్రాణాలు పణంగా పెట్టి.. వ్యవసాయ రంగాన్ని ఎలా కాపాడుకున్నారో భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకుంటాయని కేజ్రివాల్ ట్వీట్ చేశారు. అమరులైన రైతులందరికి నా వివాళులు అని అందులో పేర్కొన్నారు.


Also read: 'మూడు నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నాం': ప్రధాని మోదీ


శాంతియుత పోరాటం విజయం సాధించింది..


సాగు చట్టాల రద్దు నిర్ణయం కోసం సుదీర్ఘంగా సాగిన శాంతియుత పోరాటం విజయం సాధించిందని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్​జిత్ సింగ్ చన్నీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన నూతన వ్యవసాయ చట్టాలను 'నల్ల'..చట్టాలుగా అభివర్ణించారు.


Also read: ప్రధాని మోదీకి రైతుల షాక్... సాగు చట్టాల ఉపసంహరణపై వారి రియాక్షన్ ఇదే...


ఎన్నికల కోసమే రద్దు..


త్వరలో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు జరగనున్నాయి. ముఖ్యంగా ఉత్తర్​ ప్రదేశ్​, పంజాబ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. కేంద్రం నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్​ గెహ్లోత్​ పేర్కొన్నారు. అయితే ఇన్ని చేసినా పశ్చిమ్​ బెంగాల్​లో ఎదురైనట్లుగానే పరాబావం తప్పదని జోస్యం చెప్పారు.


Also read: దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని.. గురునానక్ జయంతి శుభాకాంక్షలు


ఎన్నికలకు.. సాగు చట్టాల రద్దుకు సంబంధం లేదు..


ఎన్నికల నేపథ్యంలోనే కేంద్రం నూతన సాగు చట్టాలను రద్దు చేసినట్లు వస్తున్న విపక్షాల వాదనపై కర్ణాటక సీఎం బసవరాజ్​ బొమ్మై స్పందించారు. ఎన్నికలకు నూతన సాగు చట్టాల రద్దుకు సంబంధం లేదని స్పష్టం చేశారు. నిరసనల మధ్య వచ్చిన ఉప ఎన్నికల్లో విజయాలు సాధించినట్లు పేర్కొన్నారు.


Also read: తమిళనాడు: భారీ వర్షాలకు కుప్పకూలిన ఇల్లు...నలుగురు చిన్నారులతో సహా 9 మంది మృతి..


గాంధేయవాద ఉద్యమం విజయం సాధించింది..


దేశం, దేశ రైతుల ప్రయోజనాల దృష్ట్య మూడు నూతన సాగు చట్టాలను రద్దు చేయాలన్న ప్రధానమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. మీ కుటుంబాలు, మీ పొలాలు మిమ్మల్ని తిరిగి ఇంటికి ఆహ్వానించేందుకు సంతోషంగా ఎదురు చూస్తుంటారు అంటూ రైతులను ఉద్దేశించి పేర్కొన్నారు. బీజేడీ ఎప్పుడు రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.


Also read: తమిళనాడును వీడని వరణుడు.. నేడు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన


అలుపెరగని పోరాటం..


నూతన సాగు చట్టాల రద్దు కోసం రైతులు చూపించిన తెగువను మెచ్చుకున్నారు పశ్చిమ్​ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బీజేపీ క్రూరంగా వ్యవహరించినా.. రైతులు బెదరకుడా. విజయం సాధించారని పేర్కొన్నారు. అవిశ్రాంతంగా పని పోరాటం చేసి ప్రతి ఒక్క రైతుకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.


Also read: గురుద్వారాలో శుక్రవారం ముస్లింల ప్రార్థనలు.. ముస్లిం సోదరులకు స్వాగతం పలికిన గురుద్వారా అసోసియేషన్


హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం..


రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించిన ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని చరిత్ర మనకు నేర్పిస్తున్నట్లు తెలిపారు. గాంధేయ వాదంతో విజయం సాధించిన రైతులందరికి అభినందలు తెలిపారు.


రైతులు చరిత్ర సృష్టించారు..


ఏడాది కాలంగా సాగుతున్న రైతుల పోరాటం ఎట్టకేలకు విజయం సాధించింది. భారత రైతులు పోరాటాల చరిత్రలో కొత్త ఛాప్టర్​ను లిఖించారు. అలుపెరుగని స్పూర్తితో పోరాడిన అమరవీరులకు, రైతుల సంఘాలకు సెల్యూట్​ అంటూ ట్వీట్ చేశారు కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్​.



Also read: 'దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపే': సుప్రీంకోర్టు


Also read: 'టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్​, నిఖిల్ జైన్​ల వివాహం భారత్​లో​ చట్టబద్దం కాదు'


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook