Over 100 Chinese troops entered 5 km into Indian territory in Uttarakhand: భారత్‌, చైనా సరిహద్దుల్లో నిత్యం వివాదాలు సృష్టిస్తున్న డ్రాగన్ కంట్రీ మరోమారు తన వక్రబుద్ధిని చూపింది. గతనెల దాదాపు వందమందికి పైగా చైనా సైనికులు (Chinese soldiers) ఎల్‌ఏసీ (వాస్తవాధీన రేఖ)ని (LAC) అతిక్రమించారని తెలిసింది. ఉత్తరాఖండ్‌లోని బారాహటి సెక్టార్‌లోని ఎల్‌ఏసీ వద్ద సరిహద్దు దాటి వచ్చారు చైనా సైనికులు. ఆగస్టు 30న సరిహద్దు దాటివచ్చిన చైనా సైనికులు మూడుగంటలకు పైగా అక్కడే ఉన్నారు. తర్వాత వెనక్కి వెళ్లారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : Bank Holiday October 2021: వచ్చే నెలలో 21 రోజులు పాటు బ్యాంకులకు సెలవులు...బి అలర్ట్


దాదాపు 100 మందికిపైగా చైనా సైనికులు (Over 100 Chinese troops) 55 గుర్రాలపై (55 horses) వచ్చినట్లు తెలుస్తోంది. ఈ చైనా సైనికులంతా అక్కడ భారత్‌ ఏర్పరుచుకున్న మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశారని సమాచారం. అంతేకాదు అక్కడున్న ఒక బ్రిడ్జిని ధ్వంసం చేశారని తెలుస్తోంది. టున్‌జున్‌లా కనుమ మార్గం ద్వారా వచ్చిన చైనా సైనికులు భారతీయ భూభాగంలోకి సుమారు 5 కిలోమీటర్ల వరకు చొచ్చుకువచ్చారు.


Also Read : Rashmika Mandanna: పుష్పలో 'శ్రీవల్లి'గా రష్మిక.. ఫస్ట్‌లుక్‌ అదుర్స్‌


ఇదే సమయంలో స్థానికులు నుంచి సమాచారం అందుకున్న ఐటీబీపీ బలగాలు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. అయితే ఐటీబీపీ (ITBP) బలగాలు రాకముందే చైనా సైనికులు వెనక్కి వెళ్లిపోయారు. చైనా దుశ్చర్యకు ప్రతిస్పందనగా భారతీయ బలగాలు కూడా ఇక్కడ పెట్రోలింగ్‌ ప్రారంభించాయి. కొన్ని ప్రాంతాల్లో ఇరు దేశాలూ బలగాల ఉపసంహరణకు అంగీకరించినా కూడా ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. చైనా (China) పలుమార్లు ఇలా కవ్వింపు చర్చలకు పాల్పడుతూనే ఉంది.


Also Read : TikTok app: టిక్ టాక్ యాప్ మళ్లీ వస్తోందా ? కొత్త పేరు TickTock App ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook