Amazon Vs China: ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్..చైనాకు ఊహించనివిధంగా షాక్ ఇచ్చింది. అమెజాన్ వేదిక నుంచి ఏకంగా 3 వేల చైనా ఆన్‌లైన్ స్టోర్లను తొలగించింది. అమెజాన్ తీసుకున్న నిర్ణయం చైనా ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపనుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ వేదిక అమెజాన్(Amazon). అమెజాన్ తీసుకున్న నిర్ణయం చైనాకు గట్టి షాక్ ఇచ్చింది. చైనాకు (China)చెందిన 3 వేల ఆన్‌లైన్ స్టోర్లను అమెజాన్ నుంచి తొలగిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఆ దేశానికి చెందిన 6 వందల చైనా బ్రాండ్‌లను(China Products Banned)ప్రొడక్ట్ జాబితా నుంచి తొలగించింది. ఫేక్ రివ్యూలతో ప్రొడక్టులను ప్రమోట్ చేయడమే దీనికి కారణంగా తెలుస్తోంది. అమెజాన్ తీసుకున్న నిర్ణయంతో దాదాపు 130 మిలియన్ యువాన్ల నష్టం ఉంటుందనేది ఆర్ధిక విశ్లేషకుల అంచనా. ఫేక్ రివ్యూలే కాకుండా ఇతర నిబంధనల్ని కూడా ఈ 3 వేల ఆన్‌లైన్ స్టోర్లు ఉల్లంఘించినట్టు సమాచారం. మేడ్ ఇన్ చైనా, సోల్డ్ ఇన్ అమెజాన్ పేరుతో ఏర్పడిన మర్చంట్ కమ్యూనిటీ ఈ వ్యవహారాన్ని నడుపుతూ వచ్చింది. వినియోగదారుల సమీక్ష ఉల్లంఘన పరిధిలో ఈ వ్యవహారం వస్తుందనేది అమెజాన్ వాదనగా ఉంది. ఎందుకంటే ప్రోత్సాహక రివ్యూల్ని 2016 నుంచి అమెజాన్ బ్యాన్ చేసింది. అటువంటి ఉల్లంఘనల్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటోంది. ఈ ఏడాది మే నుంచి ఇలాంటి ఫేక్ రివ్యూలపై దృష్టి పెట్టి చర్యలకు దిగింది. కేవలం ఆ స్టోర్లను బ్యాన్ చేయడమే కాకుండా న్యాయపరమైన చర్యలు కూడా చేపట్టనుంది.
అయితే చైనా ఈ కామర్స్ మార్కెట్‌పై(E Commerce market)అమెజాన్ చర్యలు పెద్దగా ప్రభావం చూపించవని చైనా మీడియా హౌస్ వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. అమెజాన్ తొలగించిన ఆన్‌లైన్ స్టోర్లు(Online Stores)..ఈబే, అలీబాబా వైపుగా మళ్లుతున్నట్టు అక్కడి మీడియా చెబుతోంది. అయితే కేవలం చైనానే కాకుండా మిగిలిన దేశాల్లో ఈ విధమైన చర్యలు చేపట్టామని అమెజాన్ చెబుతోంది.
Also read: iPhone Latest Update: ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్, లేటెస్ట్ అప్‌డేట్ అందుబాటులో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook