ఒరిస్సా ప్రాంతానికి చెందిన 100 మంది మాజీ నక్సలైట్లు సరెండర్ అయ్యాక వారికి ప్రభుత్వం విద్యా, ఉపాధి మార్గాలు చూపించాలని భావించింది. ఈ క్రమంలో వారందరూ డిగ్రీ చేయడం కోసం ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) వారు నిర్వహించే ప్రవేశ పరీక్ష రాయడానికి అనుమతించింది. గురువారం నాడు సరెండర్ అయిన నక్సలైట్లు మల్కన్ గిరి ప్రాంతంలోని సెంట్రల్ స్కూలుకి ఎంట్రన్స్ టెస్టు రాయడానికి వచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాము కూడా సమాజంలో భాగం కావాలని భావిస్తున్నామని.. అందుకే డిగ్రీ చేసి ఉపాధి పొందాలని యోచిస్తున్నామని..అందుకు ప్రభుత్వం కూడా సహకరిస్తామని తెలిపిందని పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థులు మీడియాకి తెలిపారు. తాజాగా ఒరిస్సాలో మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సరెండర్ అయ్యే నక్సలైట్లకు పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం పలు పథకాలు కూడా తీసుకొస్తోంది.


ఈ పథకాలలో భాగంగా మాజీ నక్సలైట్లు ఉద్యోగం పొందే వరకూ వారిని ప్రభుత్వమే ఆర్థికంగా ఆదుకోవాలని.. అలాగే సరెండర్ అయ్యే వారికి చదువుకొనేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం యోచన చేస్తోంది.