Paytm Processing Fee | డిజిటల్ పేమెంట్స్ అండ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అయిన పేటీఎం వ్యాపారస్తులకు శుభవార్త తెలిపింది. యూపీఐ, రుపే కార్డ్స్ తో పాటు పేటీఎం వ్యాలెట్ నుంచి వ్యాపారస్తులు ఇకపై అన్ లిమిటెడ్ పేమెంట్స్ పొందే అవకాశం ఉంటుంది. అది కూడా సున్నా ప్రాసెసింగ్ ఫీజుతో. దీని వల్ల భారతదేశంలో సుమారు 17 మిలియన్ల మంది వ్యాపారస్తులకు ప్రయోజనం కలుగుతుంది. డబ్బు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి ఎలాంటి ఫీజు లేకుండా వెళ్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read | YES Bank : క్రెడిట్ కార్డు రివార్ట్ ప్రోగ్రామ్ మరింత లాభదాయకంగా మారనుంది


దేశ వ్యాప్తంగా వ్యాపారస్తులు ఆర్థిక లావాదేవీలు సులభంగా జరిగేలా పేటీఎం (Paytm)పలు కొత్త సంస్కరణలను తీసుకువచ్చింది. ఇవి చిన్నా, సూక్ష్మ పరిశ్రమలకు ప్రయోజనం కలిగించనున్నాయి. వాటితో పాటు కిరాణ, హోల్ సేల్, రీటైలర్లు, ఫ్రీలాంసెర్లకు మరింత ప్రయోజనం కలిగించనున్నాయి.



Also Read | WhatsApp OTP Scam | అంటే ఏంటి ? దీని నుంచి తప్పించుకోవడం ఎలా ?


ఈ సంస్కరణల వల్ల డిజిటల్ ఇండియా ( Digital India) అనే భారత ప్రభుత్వ నినాదం మరింత ముందుకు వెళ్లనుంది. ప్రస్తుతం 17 మిలియన్ల మంది వ్యాపారస్తులు పేటీఎంను తమ వ్యాపారా లావాదేవీలకు వాడుతున్నారు.



Also Read |  Tip To Get Rich: వాస్తుశాస్త్రంలోని ఈ చిట్కాలు పాటిస్తే మీరు ధనవంతులు అవుతారు


ఇటీవలే పేటీఎం పోస్టు పెయిడ్ వినియోగదారుల కోసం ఒక  ఆఫర్ తీసుకొచ్చింది. తమ పోస్టు పెయిడ్ సర్వీసును ఈక్వేటెడ్ మంత్లీ ఇంస్టాల్మెంట్ ( EMI) గా కన్వర్ట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. వినియోగదారులు తమకు కావాల్సిన నిత్యావసరాలను సులభ వాయిదాలు పద్దతిలో కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.



Also Read | Women Empowerment : మహిళల కోసం ప్రత్యేక సేవింగ్ ఎకౌంట్, వడ్డీ ఎంతో తెలుసా?


ఈ విధంగా వారి షాపింగ్ చేసే అలవాటులో కొంత మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. దాంతో పాటు Buy Now and Pay Later అనే సదుపాయాన్ని వినియోగించి సుమారు 5 లక్షల షాపులు, వెబ్ సైట్స్ నుంచి సరుకు కొనుగోలు చేయవచ్చు.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR