Passengers stuck on ship at Mormugao port: ఓ క్రూజ్‌ నౌకలో కరోనా కలకలం రేపింది. ముంబయి నుంచి గోవా వెళ్లిన ఓ క్రూజ్‌ నౌకలోని సిబ్బంది ఒకరికి కొవిడ్ పాజిటివ్ గా తేలింది.  దీంతో  దాదాపు 2వేల మందికి పైగా ప్రయాణికులు (passengers) గోవా తీరంలోనే చిక్కుకుపోవాల్సి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముంబై పోర్ట్‌ నుంచి 2, 016 మంది ప్రయాణికులు, సిబ్బందితో కార్డెలియా క్రూజ్‌ నౌక (Cordelia Cruise Ship) గోవాకు బయల్దేరింది. అయితే సిబ్బంది ఒకరు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వైద్యులు ఆ వ్యక్తికి కరోనా పరీక్షలు చేశారు. యాంటిజెన్‌ టెస్ట్‌లో అతడికి పాజిటివ్‌గా (Covid-19 Positive) నిర్ధారణ అయ్యింది. కరోనా సోకినట్లు తేలగానే నౌకను గోవా తీరంలో (Goa port) నిలిపేందుకు అధికారులు అంగీకరించలేదు. దీంతో మోర్ముగావ్‌ తీరంలో (Mormugao port) నిలిపారు.


Also read: Corona cases in India: ఒక్క రోజులో 33 వేల కరోనా కేసులు- థార్డ్​ వేవ్​కు సంకేతమా?


నౌకలోని వారందరికీ అధికారులు పరీక్షలు చేశారు. వాటి ఫలితాలు వచ్చే వరకు ప్రయాణికులెవరూ నౌక నుంచి దిగేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో నిన్నటి నుంచి ప్రయాణికులంతా షిప్‌లోనే చిక్కుకుపోయారు. ఇదిలా ఉండగా.. నౌకలో ఎక్కిన వారంతా రెండు డోసుల టీకా తీసుకున్నవారేనని కార్డెలియా క్రూజ్‌ ప్రతినిధులు వెల్లడించారు. కరోనా నిర్ధారణ అయిన వ్యక్తిని ప్రస్తుతం నౌకలోనే ఐసోలేషన్‌లో (isolation) ఉంచారు. కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో ఇటీవల ఆంక్షల్ని ఎత్తేసింది గోవా ప్రభుత్వం. దీంతో అధిక సంఖ్యలో పర్యాటకులు గోవాకు వెళ్తున్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook