భారతదేశ ముస్లింలను ఎవరైనా 'పాకిస్థానీ' అని పిలిస్తే వాళ్లను కఠినంగా శిక్షించాలని ఏఐఎంఐఎం పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఇండియన్ ముస్లింను 'పాకిస్తానీ' అని పిలిచే వారిని శిక్షించేందుకు చట్టాన్ని తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.


రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో భాగంగా ఒవైసీ లోక్‌సభలో మంగళవారం మాట్లాడారు. భారత ముస్లింలను 'పాకిస్తానీ' అని పిలిచే వారికి మూడేళ్ల జైలుశిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. కానీ మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అలాంటి చట్టాన్ని చేయలేదని  విమర్శించారు. ట్రిపుల్ తలాక్ బిల్లు మహిళలకు వ్యతిరేకం(యాంటీ-ఉమెన్)గా ఉందని ఆరోపించారు.