బీహార్ ఎన్నికల ( Bihar Elections ) ప్రచారం నేపధ్యంలో నేతల మధ్య విమర్శల తీవ్రత పెరుగుతోంది. సీఏఏ మరోసారి చర్చకొచ్చింది. ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ ( RSS Chief Mohan Bhagwat ) , మజ్లిస్ నేత ఒవైసీల మధ్య ఇదే విషయంపై అగ్గి రాజుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఓ వైపు ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్. మరోవైపు మజ్లిస్ పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ ( Asaduddin Owaisi ) ఇద్దరి మధ్య వాదప్రతివాదనలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడిద్దరూ మరోసారి ఒకరిపై మరొకరు విమర్శలు ఎక్కుపెట్టుకుంటున్నారు. పౌరసత్వ సవరణ చట్టం వేదికగా మారింది. 


నాగ్‌పూర్ ( Nagpur ) ‌లో జరిగిన సంఘ్ వార్షిక విజయ దశమి ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. ఆర్‌ఎస్‌ఎస్ ఏ ప్రత్యేక మత సమాజానికి వ్యతిరేకం కాదని, అయితే కొంతమంది మా ముస్లిం సోదరులను తప్పుదారి పట్టించారని తెలిపారు. దేశంలోని ముస్లిం జనాభాను తనిఖీ చేయడానికి దీనిని ఉపయోగిస్తున్నట్లుగా CAA  పై వ్యతిరేకత ఉందని.. వాస్తవానికి CAA కారణంగా భారతీయ పౌరులు ఎవరూ బెదిరించబడలేదని మోహన్ భగవత్ చెప్పారు. 


ఈ వ్యాఖ్యలు మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీకు ఆగ్రహం తెప్పించాయి. మేము చిన్న పిల్లలం కాదు  తప్పుదారి పట్టించడానికంటూ ట్విట్టర్ వేదికగా కౌంటర్ విసిరారు. సీఏఏ, ఎన్ఆర్సీలపై సరైన వివరణ కూడా బీజేపీ ఇవ్వలేదన్నారు. ఒకవేళ ఈ చట్టం ముస్లింల గురించి కాకపోయుంటే.. మతం గురించిన అన్ని సూచనలను చట్టం నుండి తొలగించండి అంటూ ఒవైసీ ట్వీట్ చేశారు. 


పౌరసత్వ ప్రాతిపదికగా మతంతో ఉన్న చట్టాన్ని దేనినైనా సరే గట్టిగా నిరసిస్తామని AIMIM చీఫ్ ఒవైసీ స్పష్టం చేశారు. అక్టోబర్ 28 నుంచి మూడు దశల్లో జరగనున్న బీహార్ ఎన్నికల్లో జట్టుకట్టిన కాంగ్రెస్-ఆర్జేడీ కూటమిపై కూడా ఓవైసీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆందోళన సమయంలో మీ నిశ్శబ్దం ( కాంగ్రెస్, ఆర్జేడీ ) మేము ఇంకా మర్చిపోలేదు. బిజెపి నాయకులు సీమాంచల్ ప్రజలను చొరబాటుదార్లను పిలుస్తుంటే..ఆర్జేడీ-కాంగ్రెస్ లు ఒక్కసారిగా కూడా నోరు విప్పలేదని విమర్శించారు. బీహార్‌లో జరగనున్న ఎన్నికల్లో సమాజ్ వాదీ జనతాదళ్ (డెమొక్రాటిక్), బిఎస్‌పిలతో  మజ్లిస్ ఒప్పందం కుదుర్చుకుంది. Also read: MP Bypolls: కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎమ్మెల్యే