OYO Founder Ritesh Agarwal Father Died: ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి రమేష్ అగర్వాల్ గురుగ్రామ్‌లోని ఎత్తైన భవనంపై నుంచి కిందపడి మరణించారు. ఈ ఘటనపై గుర్గావ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. రమేష్ అగర్వాల్ తన భార్యతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆ భవనంలోని 20వ అంతస్తు నుంచి కింద పడిపోవడంతో మృతిచెందారు. ప్రమాద సమయంలో కుటుంబ సభ్యులు కూడా ఇంట్లో ఉన్నారు. తన తండ్రి మరణ వార్తను రితేష్ అగర్వాల్ కూడా ధృవీకరించారు. 
 
'మా మార్గదర్శి, మా బలం, మా నాన్న రమేష్ అగర్వాల్ మార్చి 10న మరణించారని బరువెక్కిన హృదయంతో నేను, నా కుటుంబం తెలియజేయాలనుకుంటున్నాను. ఆయన తన జీవితమంతా ఉన్నత మార్గంలో గడిపారు.  ప్రతిరోజూ మాలో చాలా మందికి స్ఫూర్తినిచ్చారు. ఆయన మరణం మా కుటుంబానికి తీరని లోటు. అత్యంత క్లిష్ట సమయాల్లో మమ్మల్ని ముందుకు తీసుకెళ్లడంలో నాన్న కరుణ, ఆప్యాయత కీలక పాత్ర పోషించాయి. ఆయన మాటలు మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఈ దుఃఖ సమయంలో ప్రతి ఒక్కరూ మా గోప్యతను గౌరవించాలని మేము అభ్యర్థిస్తున్నాము..' అని రితేష్ అగర్వాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఘటనపై గురుగ్రామ్ డీసీపీ ఈస్ట్ వీరేంద్ర విజ్ మాట్లాడుతూ.. రమేష్ అగర్వాల్ గురుగ్రామ్ సెక్టార్ 54లోని డిఎల్‌ఎఫ్‌కి చెందిన ది క్రెస్ట్ 20వ అంతస్తు నుంచి పడిపోవడం వల్లే మృతి చెందారని తెలిపారు. సీఆర్‌సీపీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. సెక్టార్ 53 ఎస్‌హెచ్ఓ నేతృత్వంలోని బృందం సంఘటనా స్థలాన్ని సందర్శించింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.  


మూడు రోజుల క్రితమే రితేష్ అగర్వాల్ ఫార్మేషన్ వెంచర్స్ డైరెక్టర్ గీతాన్షా సూద్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సాఫ్ట్‌బ్యాంక్ చైర్మన్ మసయోషి సన్, పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆయన వివాహం జరిగిన మూడు రోజులకే తండ్రి మరణించడం బాధాకరం. 


Also Read: Vivek Murder Case: వివేకా హత్య కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు.. ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట  


Also Read: MP Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు.. మొత్తం బయటపెట్టిన అవినాష్ రెడ్డి  


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి