Telangana High Court On Mp Avinash Reddy Petition: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. సోమవారం వరకు ఎంపీని అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. ఇప్పటివరకు విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో టేపులను హార్డ్ డిస్క్ రూపంలో మంగళవారం కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేసింది. అదేవిధంగా ఘటన స్థలంలో లభించిన లెటర్.. దానికి సంబంధించిన ఎఫ్‌ఎస్ఎల్ రిపోర్టులను కూడా సమర్పించాలని ఆదేశించింది.
వివేకా హత్య కేసులో ఇప్పటివరకు ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ రెండుసార్లు విచారించిన విషయం తెలిసిందే. మూడోసారి ఈ నెల 6న విచారణకు హాజరుకావాలసి సీబీఐ నోటీసులు జారీ చేయగా.. తనకు పులివెందులలో ముందస్తు కార్యక్రమాల నేపథ్యంలో తాను ఆ రోజు హాజరుకాలేనని అవినాష్ రెడ్డి తెలిపారు. అయితే మార్చి 10, 11వ తేదీల్లో ఎప్పుడైనా హాజరవుతానని ఆయన స్పష్టంచేశారు. ఎంపీ లేఖపై స్పందించిన సీబీఐ.. మార్చి 10న విచారణకు రావాలని మళ్లీ నోటీసులు ఇచ్చింది.
శుక్రవారం విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. గురువారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు అవినాష్ రెడ్డి. తన సీబీఐ విచారణను న్యాయవాది సమక్షంలో నిర్వహించాలని.. అంతేకాకుండా విచారణకు సంబంధించి ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐకు ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న దస్తగిరిని ఇప్పటివరకు సీబీఐ అరెస్టు చేయలేదని.. అతడి ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించకపోవడాన్ని కోర్టుకు నివేదించారు. కేసు విచారణ అంతా కేవలం దస్తగిరి చెప్పిన మాటల ఆధారంగానే కొనసాగుతోందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
వివేకా హత్య కేసు విచారణ పారదర్శకంగా లేదని ఎంపీ అన్నారు. తనకు వ్యతిరేకంగా ఏ విధమైన సాక్ష్యాలు లేకపోయినా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విచారణలో తాను చెప్పిన విషయాల్ని విచారణాధికారి మార్చేస్తున్నారని అవినాష్ రెడ్డి పిటీషన్‌లో తెలిపారు. తనపై సీబీఐ ఏ విధమైన బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని అవినాష్ రెడ్డి కోరారు. ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరయ్యారు.
Also Read: Actor Naresh Marriage: నరేష్-పవిత్రల పెళ్లి వీడియో.. పవిత్ర బంధం అంటూ నటుడి ట్వీట్.. అసలు విషయం ఇదా!
Also Read: Dharani Portal Issues: ధరణి పోర్టల్ సమస్యలపై కాంగ్రెస్ హామీ కార్డు.. పైలెట్ ప్రాజెక్టు ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి