Pakistan Military claims indian Unarmed Supersonic Missile landed in pakistn land: భారత్-పాకిస్తాన్ మధ్య మరో వివాదం రాజుకుంది. ఇండియాకు చెందిన ఓ మిస్సైల్ తమ భూభాగంలో పడిందంటూ పాక్ ఆరోపించింది. దీనిపై పాక్ జనరల్ మేనేజర్ బాబర్ ఇప్తికర్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. బుధవారం సాయంత్రం హర్యానాలోని సిస్రా వైపు నుంచి ఒక మిస్సైల్ దూసుకొచ్చినట్లు వెళ్లడించారు. ఆ సూపర్ సోనిక్ మిస్సైల్ పాక్ సరిహద్దుల్లో కూలిందని తెలిపారు. దీనిపై భారత్ వివరణ ఇవ్వాల్సిందేనన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఎయిర్ డిఫెన్స్ ఆపరేషన్స్ సెంటర్.. పాక్ లోని చన్ను సమీపంలో ఓ అనుమానిత వస్తువును స్వాధీనం చేసుకుంది. అనుమానిత వస్తువు శిథిలాలను బట్టి అది భారత్ కు  చెందిన సూపర్ సోనిక్ మిస్సైల్ ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేసింది. ఈ ఘటలో ఎలాంటి నష్టం కలగకపోయినా.. ఓ గోడమాత్రం నాశమైనట్లు తెలిపింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పాకిస్తాన్... ఇది ముమ్మాటికీ తమ గగన తలాన్ని ఉల్లంఘించడమేనని ఆరోపించింది. ప్యాసింజర్ ఫ్లైట్లు తిరిగే ఎత్తులోనే ఈ మిస్సైల్ దూసుకొచ్చిందని.. పైగా జనావాస ప్రాంతాల్లో పడిందని ప్రకటన రిలీజ్ చేసింది. అయితే ఈ ఆరోపణలపై భారత రక్షణశాఖ ఇప్పటివరకు స్పందించలేదు. 


2005 లో భారత పాకిస్తాన్ దేశాలు ఓ ఒప్పందం చేసుకున్నాయి. దీన్ని బట్టి ఏ దేశం క్షిపణి పరీక్షలు నిర్వహించినా... మూడు రోజుల ముందే తెలియజేయాలి. ఎవరికీ నష్టం కల్గకుండా నిర్ణీత వ్యవధిలో పరీక్షలు చేపట్టాలి. ఇప్పుడీ ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని పాక్ ఆరోపిస్తోంది.


Also Read: Revanth Reddy-Jagga Reddy: అనూహ్యం.. రేవంత్, జగ్గారెడ్డి భేటీ... ఇద్దరి మధ్య 20ని. పాటు చర్చలు..


Also Read: Mamta Mohandas: చీరకట్టులో చిలిపి చూపుల మమతా మోహన్​దాస్​!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేయండి