Mumbai: అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం. తాజాగా ఓ నిరుపేద మత్యకారుడు కోటీశ్వరుడైనా సంఘటన దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. ముంబై-పాల్ఘర్ (Mumbai - Palghar) తీరంలో చేపల వేటకు వెళ్లిన చంద్రకాంత్ తారే అనే మత్స్యకారుడి వలకు ఒకేరోజు రూ.కోట్ల విలువైన చేపలు చిక్కాయి. ఈ విషయం తెలుసుకొని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో అధికారులు నెల రోజుల పాటు చేపలవేట(Fishing) నిషేధించారు. ఆ నిషేధాన్ని ఇటీవల ఎత్తి వేస్తూ చేపలవేటకు అనుమతించారు. పాల్ఘర్‌ (Palghar)లోని ముర్భేకి చెందిన చంద్రకాంత్ తారే ఆగస్టు 28న సముద్రం మీద వేటకు వెళ్లాడు.  పాల్ఘర్ తీరానికి 25 నాటికల్ మైళ్ల దూరంలో చేపలు పట్టడం ప్రారంభించాడు. 10 మంది సభ్యులతో కలిసి అతడు వేటకు వెళ్లాడు. అయితే మొదటి రోజే అతడి వలలో 157 అరుదైన ఘోల్ జాతి చేపలు (Ghol fish) చిక్కాయి. దీంతో వారు ఆనందం పట్టలేక ఎగిరి గంతులేశారు. . వీరి బృందంలోని ఒకరు దీనికి సంబంధించిన వీడియోను ఇతరులకు షేర్ చేశారు. ఘోల్ చేపలు అత్యంత ఖరీదైనవి కావడంతో అతడు కోటీశ్వరుడిగా ఇంటికి తిరిగి వచ్చాడు. దాంతో గంటల వ్యవధిలోనే చుట్టుపక్కల జాలర్ల గ్రామాల్లో ఈ వార్త దావానలంలా వ్యాప్తి చెందింది.


Also Read: Mumbai Flash Floods: ముంబైలో మెరుపు వరదలు, భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలం


ఒక్కో చేప ఖరీదు రూ.85,000 వేలు 
ఘోల్(Ghol fish) రకం చేపలు తన జీవితాన్నే మార్చేస్తాయని చంద్రకాంత్ ఊహించలేకపోయాడు. సముద్ర తీరం నుంచి తిరిగి వస్తుండగా ముర్భేలో వ్యాపారులు అతడి కోసం వరుస కట్టడం చూసి ఆశ్చర్యపోయాడు. ఈ చేపలను వేలం వేసిన వ్యాపారులు రూ.1.33 కోట్లకు మొత్తం 157 ఘోల్ చేపలను దక్కించుకున్నారు. దాంతో చంద్రకాంత్ ఎవరూ ఊహించని రీతిలో కోటీశ్వరుడయ్యాడు. దాదాపు ఒక్కో చేప రూ. 85,000 వేలు పలికింది.


తూర్పు ఆసియా దేశాల్లో మంచి డిమాండ్
ఘోల్ ఫిష్‌కు తూర్పు ఆసియా దేశాల్లో మంచి ధర పలుకుతుంది. ముఖ్యంగా ఇండోనేషియా, థాయ్‌లాండ్, హాంకాంగ్, సింగపూర్, మలేషియాలలో భారీ డిమాండ్ ఉంది. దాని అంతర్గత అవయవాలకు అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయట. సముద్రపు బంగారం(Sea Gold)గా పిలిచే ఈ బ్లాక్‌స్పాట్ క్రోకర్ చేపల చర్మం హైక్వాలిటీ కొల్లాజెన్‌(Collagen) కలిగి ఉంటుంది. ఫంక్షనల్ ఫుడ్, కాస్మెటిక్ ప్రొడక్ట్స్ తయారీలో కొల్లాజెన్ విరివిగా వాడుతుంటారు. దాని రెక్కలు ఔషధ విలువను కలిగి ఉంటాయి. ఫార్మా కంపెనీలు కరిగే కుట్లు తయారు చేయడానికి ఈ చేపలనే ఉపయోగిస్తుంటారు.


Also Read: Honey Bee: ఒంటిపైనే తేనెటీగల్ని పెంచుకునే వ్యక్తిని ఎప్పుడైనా చూశారా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook