Mumbai Flash Floods: ముంబైలో మెరుపు వరదలు, భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలం

Mumbai Flash Floods: దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరం మరోసారి తడిసి ముద్దయింది. భారీ వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఘాట్ రోడ్లపై కొండ చరియలు విరిగిపడ్డాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 1, 2021, 10:26 AM IST
Mumbai Flash Floods: ముంబైలో మెరుపు వరదలు, భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలం

Mumbai Flash Floods: దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరం మరోసారి తడిసి ముద్దయింది. భారీ వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఘాట్ రోడ్లపై కొండ చరియలు విరిగిపడ్డాయి.

రాజధాని ముంబై నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు(Heavy Rains)కురుస్తున్నాయి. గత 24 గంటల్నించి కురుస్తున్న వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర, కొంకణ్, విదర్బ ప్రాంతాల్లో కురిసిన వర్షాలు ముంబై నగరంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. అటు ఔరంగాబాద్ జిల్లాలో కూడా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. కన్నడ ఘాట్ రోడ్డుపై కొండ చరియలు విరిగిపడ్డాయి. శిధిలాలు, బురద కారణంగా వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వందలాది వాహనాలు ఘాట్ రోడ్డుపై ఇరుక్కుపోయాయి. శిధిలాల తొలగింపు, వాహనరాకల పునరుద్ధరణ పనులు జరగుతున్నాయి. కొంకణ్ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. 

మహారాష్ట్రలోని(Maharashtra)పలు ప్రాంతాల్లో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమైంది. వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు, చెరువులు, కుంటలు నిండిపోయాయి. వరదల్లో(Mumbai Floods)జంతువులతో పాటు మనుష్యులు కూడా కొట్టుకుపోయినట్టు సమాచారం. చాలా ప్రాంతాల్లో వంతెనలు తెగిపోవడం లేదా ముంపుకు గురి కావడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

Also read: Rajya Sabha: రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా రామాచార్యులు నియామకం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News