Parliament Monsson Sessions: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కరోనా నిబంధనల మధ్య దాదాపు నెలరోజులపాటు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్ సెషన్స్‌కు సంబంధించిన విధి విధానాల్ని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) తగ్గుముఖం పట్టడంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూలై 19 నుంచి ఆగస్టు 13 వరకూ జరిగే పార్లమెంట్ సమావేశాలకు సంబంధించిన విధి విధానాల్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(Loksabha speaker om birla)వెల్లడించారు. కరోనా వైరస్ నేపధ్యంలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమై..సాయంత్రం 6 గంటల వరకూ ఉభయ సభల సమావేశాలు కొనసాగనున్నాయి. డిజిటలైజేషన్ ద్వారా మెజార్టీ కార్యక్రమాల్ని నిర్వహించేలా పార్లమెంట్ సమావేశాల కోసం ప్రత్యేక యాప్ త్వరలో తీసుకొస్తామని ఓం బిర్లా తెలిపారు. సమావేశాలకు ఒకరోజు ముందు అంటే జూలై 18వ తేదీన అఖిలపక్ష సమావేశం ఉంటుందన్నారు. 


పార్లమెంట్ వర్షాకాల సమావేశాల(Parliament Monsoon Sessions) నేపధ్యంలో విధి విధానాల్ని రూపొందించారు. ప్రతి ఒక్క ఎంపీ కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ప్రతి పార్లమెంట్ సభ్యుడు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి, అదే విధంగా కనీసం ఒక డోసైనా కోవిడ్ వ్యాక్సిన్ (Covid19 Vaccine)వేయించుకుని పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనాలని నిబంధన విధించారు. ఇప్పటి వరకూ 444 మంది లోక్‌సభ ఎంపీలు, 218 మంది రాజ్యసభ ఎంపీలు వ్యాక్సిన్ వేయించుకున్నట్టు సమాచారం.


Also read: Bank Jobs Notification 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు, నోటిఫికేషన్ విడుదల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook