Bank Jobs Notification 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు, నోటిఫికేషన్ విడుదల

Bank Jobs Notification 2021: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 12, 2021, 02:26 PM IST
 Bank Jobs Notification 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు, నోటిఫికేషన్ విడుదల

Bank Jobs Notification 2021: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బ్యాంకింగ్ ఉద్యోగాల (Bank jobs)కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్‌ను(Bank jobs notification)ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ విడుదల చేసింది.దేశవ్యాప్తంగా 5 వేల 380 క్లరికల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ఐబీపీఎస్ (IBPS)తెలిపింది. ఇందులో తెలంగాణలో 263 ఖాళీలుండగా..ఏపీలో కూడా 263 ఖాళీలున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలలో ఈ ఖాళీలున్నాయి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్ధుల అర్హతలు, వయస్సు వివరాలు ఇలా ఉండాలి.

గుర్తింపు పొందిన యూనివర్శిటీ ఏదైనా డిగ్రీ పాస్ అయుండాలి.సంబంధిత రాష్ట్ర అధికారిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి. 2021 జూలై 1 నాటికి 20-28 ఏళ్ల మధ్యలో వయస్సు ఉండాలి. రిజర్వేషన్ కలిగిన వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. జూలై 12 నుంచి అంటే ఇవాళ్టి నుంచి దరఖాస్తులు(Applications on online)స్వీకరిస్తారు. చివరి తేదీ ఆగస్టు 1గా ఉంది. ఆన్‌లైన్‌లో ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 28, 29,సెప్టెంబర్ 4 తేదీల్లో ఉంటుంది. ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష అక్టోబర్ 31న ఉంటుంది. ప్రిలిమినరీ వంద మార్కులకు, మెయిన్స్ వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కుల విధానం ఉంటుంది.ఇతర వివరాలకు లేదా దరఖాస్తు చేయడానికి https://www.ibps.in/ ను సంప్రదించాలి.  

Also read: Rahul Gandhi: దేశంలో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

వ్యాక్సినేషన్ ప్రక్రియపై రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు

Trending News