Parliament Security: ఢిల్లీలోని పార్లమెంటు సెక్యురిటీని ఇకపై కేంద్రానికి చెందిన సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ చేపట్టనుంది. అంతేకాదు డిల్లీలోని పాత, కొత్త పార్లమెంట్ భవనాలకు సంబంధించిన 3,317 మంది సిబ్బంది సోమవారం నుంచి పార్లమెంట్ ఆవరణలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఉగ్రవాద వ్యతిరేక, డిఫెన్స్ మోడ్ యాక్షన్‌లో భద్రతా సిబ్బంది బాధ్యతలు నిర్వహించబోతున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా కౌంటర్ ఇంటిలిజెన్స్‌తో పాటు ఏదైనా ఉగ్రదాడులు జరిగితే తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే సీఐఎస్‌ఎఫ్ తన టీమ్‌ను ట్రెయిన్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు పార్లమెంట్ భద్రతా వ్యవహారాలను సీఆర్పీఎఫ్‌కు చెందిన 1400 మంది 24/7 విధులు నిర్వర్తించేవారు. ఇకపై 3317 మంది నిరంతరం పాత, కొత్త పార్లమెంట్ భవనాల బాధ్యతలను చేపట్టనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ శుక్రవారమే CRPF కు చెందిన కమెండోలు పార్లమెంట్ సెక్యూరిటీ డ్యూటీ నుంచి పక్కకు తప్పుకున్నాయి. వాటి బాధ్యతలను సీఐఎస్‌ఎఫ్ టేకప్ చేసింది. గతేడాది డిసెంబర్ 13 పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటన తర్వాత కొత్త, పాత పార్లమెంట్ భవనాల, అనుబంధ నిర్మాణాల భద్రతా బాధ్యతలను సీఐఎస్ఎఫ్ అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 4 విడతలు పూర్తైయి నేడు 5వ విడత ఎన్నికలు జరుగుతున్నాయి. మరో రెండు విడతల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. జూన్ 1 ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ సారి 542 లోక్ సభ సీట్లతో పాటు ఆంధ్ర ప్రదేశ్,  ఒడిషా, సిక్కిం, అరుణాల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. 


Read more: Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి