Parliament Winter Session: ఈ నెలాఖరు నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు?
Parliament Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలను సీసీపీఏ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకనట వెలుడుంది.
Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 29న ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించాలని.. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) సిఫార్సు చేసినట్లు (Cabinet Committee on Parliament Affairs) అధికారిక వర్గాల ద్వారా తెలిసింది.
ఈ సారీ కరోనా నిబంధనల మధ్యే..
కరోనా కారణంగా గత ఏడాదిన్నర కాలంగా ఏ సమావేశాలైనా.. కొవిడ్ నిబంధనల (COVID protocal in Parliament) మధ్యే జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు సైతం కఠిన కొవిడ్ నిబంధనల మధ్యే సాగాయి.
అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం (Corona cases in India) పట్టినా, వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతున్నా.. కఠిన కొవిడ్ నిబంధనల మధ్యే సమావేశాలు జరగనున్నాయి. ఈ నిబంధనల ప్రకారం.. ఉభయ సభలకు హాజరయ్యే ఎంపీలు, ఇతర సిబ్బంది అందరూ కొవిడ్ టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి.
Also read: Uphaar tragedy : ఉపహార్ థియేటర్ విషాదం... Ansal brothers కు ఏడేళ్ల జైలు శిక్ష
Also read: Shah Rukh Khan viral video: మీడియా నుంచి తప్పించుకునేందుకు SRK పాట్లు.. వీడియో వైరల్
ఈ సారి చర్చాంశాలు ఇవే..
వచ్చే ఏడాది.. ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు (Elections in five states) జరగనున్నయి. దీనితో ఈ పార్లమెంట్ సమావేశాలు కీలకంగా మారాయి. ఈ సారి సమావేశాల్లో.. పెట్రోల్ ధరలు(Petrol prices), లఖింపుర ఖేరీలో రైతులపైకి కేంద్ర మంత్రి కుమారుడి కారు దూసుకెళ్లడం వంటి అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. రైతుల చట్టాల రద్దు అంశంపై కూడా చర్చ సాగనుంది.
Also read: Five years to the demonetisation: పెద్ద నోట్ల రద్దుకు నేటితో ఐదేళ్లు- కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు
వీటన్నింటిని ఎందుర్కొంటునే కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఈ ఏడాది వర్షాకాల సమావేశంలో ఉభయ సభల్లో పెగసస్ రగడ నడిచింది. దీనితో ముఖ్యమైన బిల్లులపై చర్చ జరగకుండానే పాసయ్యాయి.
పార్లమెంట్లో సమయం వృధా చేస్తున్నారంటూ..అధికార బీజేపీ ప్రతిపక్షాలను విమర్శించింది. ప్రతి పక్షాలు కూడా కేంద్రంపై వివిధ అంశాలను ప్రస్తావిస్తూ ప్రతి విమర్శలు చేశాయి.
Also read: Mukesh Ambani Security: ముకేశ్ అంబానీ ఇంటి వద్ద భద్రత పెంపు- ఎందుకంటే..
Also read: US Travel Curbs Lifted: ఆంక్షల ఎత్తివేతతో అమెరికా-భారత్ మధ్య ప్రయాణాలు పునఃప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook