Parliament Winter Session: నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. అస్త్రశస్త్రాలతో రెడీ అవుతున్న ప్రతిపక్షాలు..
Parliament Winter Session 2024: కీలకమైన నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఉభయ సభలు మరికాసేట్లో ప్రారంభం కానున్నాయి. హర్యానా, మహారాష్ట్ర విజయాలతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మంచి ఊపు మీదుంది. మరోవైపు కాంగ్రెస్ అదానీ సహా పలు అంశాలతో ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయడానికి అస్త్ర శస్త్రాలను రెడీ చేస్తోంది.
Parliament Winter Session 2024: పార్లమెంటు శీతాకాల సమావేశాలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. నవంబర్ 25 (నేడు) నుంచి డిసెంబరు 20 వరకు ఇవి కొనసాగనున్నాయి. ఈ నెల 26న మాత్రం ఉభయసభలకు సెలవు ఉంటుంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ రోజు పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయసభల సభ్యులనుద్దేశించి ప్రసంగిస్తారు. సభా వ్యవహారాల సంఘం లో నిర్ణయించిన అంశాల ఆధారంగా మిగిలిన రోజుల్లో సభలు కొనసాగనున్నాయి. దీనికి సన్నాహకంగా పార్లమెంటరీ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. 30 పార్టీల నుంచి 42 మంది నేతలు దీనికి హాజరయ్యారు.
వక్ఫ్ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదిక ఈ సమావేశాలు ప్రారంభమైన తొలి వారంలో సభ ముందుకు వస్తుందా? రాదా? అనేది తేలాల్సి ఉంది. నిర్దేశించిన గడువు ప్రకారం ఈ నివేదిక శుక్రవారం లోపు సభ ముందుంచాలి. ఈ సమావేశాల్లో 17 బిల్లులు చర్చకు రానున్నాయి. మహారాష్ట్రలో గెలుపుతో అధికార పక్షం ఊపుమీద ఉంది. కాగా అన్ని అంశాలపై ఉభయసభల్లో చర్చలు జరగాలని కోరుకుంటున్నామని, ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు తెలిపారు. .
అదానీ అంశంలో పట్టు బిగించాలని విపక్షం పట్టుదలతో ఉంది. దీనిపై సమావేశాల్లో చర్చించాలని తాము అఖిలపక్షంలో డిమాండు చేసినట్లు లోక్‌సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగొయ్ వెల్లడించారు. ఈ కుంభకోణం అమెరికాలో బయటపడినందున దానిపై ప్రభుత్వం జవాబు చెప్పాలన్నారు. ప్రభుత్వం పారిపోయే ప్రయత్నం చేయకుండా మణిపుర్ హింసపైనా సమాధానమివ్వాలని సూచించారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతితో కలిసి ప్రజలు రాజ్యాంగ పీఠికను చదువుతారు. రాజ్యాంగంతో ముడిపడిన చాలా అంశాలను పుస్తకరూపంలో తీసుకొస్తున్నట్టు చెప్పారు. రాజ్యాంగం రూపొందించడానికి ముందు ఏం జరిగిందన్నది చాలా మందికి తెలియదు. రాజ్యాంగం సాధారణ పుస్తకం కాదు. అందులో ఉన్న చిత్రాలు, వర్ణనలు, ప్రధానోద్దేశాలను ప్రజలవద్దకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నామన్నారు కిరణ్ రిజిజు.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter