Parliament Winter Session 2021 Updates: "If 12 MPs Apologise, Then We Can Review": Government On Suspension Row : పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభమైన మొదటిరోజే 12 మంది విపక్ష ఎంపీలు రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. గత సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించారంటూ కాంగ్రెస్ సహా పలు పార్టీలకు చెందిన ఎంపీలపై నిన్న స‌స్పెన్ష‌న్ విధించారు. అయితే స‌స్పెన్ష‌న్ అయిన ఎంపీలు క్ష‌మాప‌ణ‌లు (12 MPs apologise) చెబితే.. వారిపై విధించిన స‌స్పెన్ష‌న్ ఎత్తివేస్తామ‌ంటూ పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషి (Parliamentary Affairs Minister Pralhad Joshi) పేర్కొన్నారు. ఎన్నో కీల‌క బిల్లుల‌ను ఈ స‌మావేశాల్లో ప్ర‌వేశపెట్టాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోందని.. విప‌క్ష స‌భ్యులు ఆరోగ్య‌క‌ర‌మైన చ‌ర్చ‌లో పాల్గొనాలని తాము ఆశిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. నియ‌మావ‌ళి ప్ర‌కారం ప్ర‌తి అంశంపై చ‌ర్చించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని వెల్లడించారు. ప్ర‌తి ప్ర‌శ్న‌కు జ‌వాబు ఇస్తామ‌ని.. ఇక ఇవ్వాళ నుంచి కీల‌క బిల్లుల‌ను స‌భ‌లో ప్ర‌వేశ‌పెడుతామంటూ మంత్రి జోషి పేర్కొన్నారు. అలాగే స‌భ హుందాగా న‌డిచేందుకు విప‌క్షాలు స‌హ‌క‌రించాల‌ని ఆయన కోరారు. వర్షకాల సమావేశాల చివరి రోజు అయిన.. ఆగస్టు 11న ప్రతిపక్షాలు ఎలా ప్రవర్తించాయో దేశం మొత్తం చూసిందని మంత్రి ప్రహ్లాద్ జోషి (Minister Pralhad Joshi) పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : Sanjay Raut Viral Dance: పెళ్లి వేడుకలో పార్లమెంట్ సభ్యులు సంజయ్ రౌత్, సుప్రియా డ్యాన్స్.. వీడియో వైరల్


సస్పెండ్‌ అయిన 12మంది సభ్యులు (12 MPs) వివరాలు ఇలా ఉన్నాయి.. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీలు ఫూలోదేవి నేతం, ఛాయా వర్మ, రిపున్‌ బోరా, రాజామణి పటేల్‌ , అఖిలేశ్‌ ప్రసాద్‌ సింగ్‌, సయ్యద్‌ నాసిర్‌ హుస్సేన్‌, తృణమూల్‌ పార్టీకి చెంది డోలా సేన్‌, శాంతా ఛత్రీ, శివసేనకు చెందిన ప్రియాంకా చతుర్వేది, అనిల్‌ దేశాయ్‌, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన ఎంపీలు బినోయ్‌ విశ్వం, కరీం ఉన్నారు.


ఇక మ‌రోవైపు విప‌క్ష నేతలు ఇవాళ పార్ల‌మెంట్‌లోని (Parliament ) మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే (Mallikarjun Kharge) కార్యాలయంలో భేటీ అయ్యారు. 12 మంది ఎంపీల స‌స్పెన్ష‌న్ అంశంపై అనుస‌రించాల్సిన వ్యూహంపై వాళ్లు చ‌ర్చించారు. బ్యాంకుల ప్రైవేటీక‌ర‌ణ కోసం పోరాటం చేశామ‌ని.. తాము క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌బోమంటూ సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం పేర్కొన్నారు. స‌స్పెన్ష‌న్‌కు గురైన ఎంపీల్లో బినోయ్ ఉన్నారు.


Also Read : Nellore Anandaiah: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా-నెల్లూరు ఆనందయ్య సంచలన ప్రకటన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook