Nellore Anandaiah: త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా-నెల్లూరు ఆనందయ్య సంచలన ప్రకటన

Nellore Anandaiah: త్వరలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన నాటు వైద్యుడు బొనిగె ఆనందయ్య ప్రకటించారు. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు బీసీలను పట్టించుకోవట్లేదని ఆరోపించారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2021, 10:31 AM IST
  • నెల్లూరు ఆనందయ్య సంచలన ప్రకటన
    త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు వెల్లడి
    కరోనా థర్డ్ వేవ్‌కు తన వద్ద మందు ఉందన్న ఆనందయ్య
Nellore Anandaiah: త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా-నెల్లూరు ఆనందయ్య సంచలన ప్రకటన

Nellore Anandaiah: కరోనా విరుగుడు పేరిట నాటు మందు అందించి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నెల్లూరు ఆనందయ్య (Bonige Anandaiah) తాజాగా సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే ఏపీలో (Andhra Pradesh) కొత్త రాజకీయ పార్టీ పెడతానని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలన్నీ బీసీలను విస్మరిస్తున్నాయని... బీసీ జేఏసీ ద్వారా రాజకీయ పార్టీని తీసుకొస్తామని చెప్పారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయాన్ని సందర్శించుకున్న సందర్భంగా ఆనందయ్య మీడియాతో మాట్లాడారు.

కరోనా గురించి కూడా ప్రస్తావించిన ఆనందయ్య... ఒకవేళ థర్డ్ వేవ్ (Covid third wave) వచ్చినా ఎదుర్కొనేందుకు తన వద్ద మందు ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే ఆ మందు అందిస్తానని తెలిపారు. ప్రస్తుతం కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో థర్డ్ వేవ్‌పై  అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య (Nellore Anandaiah) గతేడాది కరోనా విరుగుడు పేరిట ఇచ్చిన నాటు మందుకు జనం విపరీతంగా ఎగబడ్డారు. ప్రకృతిలో దొరికే వనమూలికలతో ఆయన ఈ నాటు మందును తయారుచేశారు. అయితే దీనిపై అప్పట్లో భిన్నాభిప్రాయాలు వినిపించాయి. ఆనందయ్య మందు పనిచేస్తోందని కొంతమంది చెప్పగా... దానికి శాస్త్రీయత లేదని మరికొంతమంది ఆరోపించారు. చివరకు ఆయుష్ శాఖ ప్రతినిధులు సైతం ఆ మందును పరిశీలించారు. ఆనందయ్య ఇస్తున్న మందులో ఎటువంటి హానికర పదార్థాలు లేవని నిర్దారించారు. కంటిలో వేసే చుక్కల మందుపై మాత్రం అభ్యంతరం చెప్పారు. ఆనందయ్య మందుకు ఆయుర్వేద మందుగా (Anandaiah Medicine)  గుర్తింపునివ్వనప్పటికీ ఒక సప్లిమెంట్‌గా, ఇమ్యూనిటీ బూస్టర్‌గా అది ప్రాచుర్యంలోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Also Read: Covid 19 : ఏడాదిన్నరగా మార్చురీలోనే-అత్యంత కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News