భారతదేశం, పాకిస్థాన్ విడిపోకుంటే మహ్మద్ అలీ జిన్నా భారత్‌కు ప్రధాని అయ్యేవారని బౌద్ధమత గురువు దలైలామా అన్నారు. జిన్నాకు దేశ ప్రధాని పదవి ఇవ్వాలని గాంధీజీ భావిస్తే.. అందుకు జవహర్ లాల్ నెహ్రూ వ్యతిరేకించారని దలైలామా చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గోవా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన దలైలామాను 'నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎలా ఉండాలి?' అని ఓ విద్యార్ధి ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఆయన చరిత్రలోకి వెళ్లారు. ప్రతి ఒక్కరూ జీవితంలో తప్పు చేస్తారన్న ఆయన.. ఇందుకు నాటి పండిట్ నెహ్రూ కూడా అతీతం కాదంటూ వ్యాఖ్యానించారు.


దలైలామా మాట్లాడుతూ.. మహ్మద్‌ అలీ జిన్నా భారత్‌కు ప్రధాని అయ్యుంటే భారతదేశం భారత్, పాక్ అని రెండు ముక్కలయ్యేది ​కాదన్నారు. ‘జిన్నాకు ప్రధాని పదవి ఇవ్వాలన్న గాంధీజీ ఆలోచనను ఆనాడు నెహ్రూ వ్యతిరేకించారు. నాడు అది జరక్కపోయుంటే నెహ్రూ స్థానంలో దేశ తొలి ప్రధాని జిన్నా అయ్యేవారు' అని దలైలామా వ్యాఖ్యానించారు.