నిర్భయ కేసు దోషుల ఉరిశిక్ష కోసం యావత్ భారతావని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తిహార్ జైలు అధికారులు నిందితులు ముకేశ్, పవన్ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్, వినయ్ శర్మల మరణశిక్ష అమలు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు పవన్ జల్లాద్(57) అనే తలారిని ఎంపిక చేశారు. తలారి అంటే ఎంతో కర్కశంగా, కఠినంగా ఉంటాడని, పచ్చి తాగుబోతు అయి ఉంటాడనే అనుమానాలు సైతం చాలా మందికి ఉన్నాయి. మీ అనుమానాలు పటాపంచలు కావాలంటే ఈ వివరాలపై ఓ లుక్కేయండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, నిర్భయ దోషులను ఎప్పుడెప్పుడు ఉరితీస్తానా అని ఎదురుచూస్తున్నట్లు మీరట్ లోని భూమియపుల్ ఏరియాకు చెందిన తలారి పవన్ జల్లాద్ తెలిపారు. ‘కూతురు వివాహానికి నగదు అవసరం. సరైన సమయంలో దేవుడు నా కోరికను మన్నించి ఈ అవకాశం ఇచ్చాడు. ఒక్కొక్కరికి రూ.25వేలు చొప్పున మొత్తం నలుగురు వ్యక్తులను ఉరితీస్తే నాకు లక్ష రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది.


Also Read: నిర్భయ కేసు దోషులకు ఉరి శిక్ష తేదీ ఖరారు


మీరట్ అధికారులు నాకు కాన్షీరాం ఆవాస్ యోజన పథకం కింద ఓ చిన్న ఇంటిని కేటాయించారు. నాకు నెలకు కేవలం రూ.5వేలు మాత్రమే జీతంగా వస్తుంది. ఓవైపు అప్పులవాళ్ల నుంచి ఇబ్బందులు. కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కావడం లేదు. కూతురి పెళ్లి గురించి ఆలోచిస్తున్న సమయంలో యూపీ అధికారులు నిర్భయ దోషులను ఉరితీసే బాధ్యత నాకు అప్పగించారు. త్వరలో నన్ను తిహార్ జైలుకు తీసుకెళ్తారు. ఉరి పనుల కోసం మానసికంగా సిద్దమయ్యాను. 


Also Read: ఉరిశిక్ష వేసే ముందు నిజంగానే చివరి కోరిక అడుగుతారా?


తరతరాలుగా మేం ఇదే పని చేస్తున్నాం. మా తాత కలురామ్ (అకా కల్లు) ఉరితీసే పనికి రూ.200 భత్యం అందుకునేవారు. 1989లో ఆగ్రా సెంట్రల్ జైలులో అత్యాచారం, హత్య కేసులో దోషి కాళ్లు నేనే కట్టేయగా.. మా తాత తాడును లాగి ఉరితీశారు. మా నాన్న మమ్ము జల్లాద్ ఉత్తర భారతదేశంలో పేరు మోసిన తలారి. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ హత్యకేసులో దోషులు సత్వంగ్ సింగ్, కేహర్ సింగ్‌లతో పాటు మరిన్ని కీలకకేసుల్లో దోషులును మా నాన్న, తాత కలిసి ఉరితీశారని’ పవన్ జల్లాద్ గుర్తుచేసుకున్నారు.


తాగుబోతులం కాదు..
తలారి అని చెప్పగానే.. అతడు పచ్చి తాగుబోతని, కఠినంగా ఉంటాడనే అనుమానాలు, అపోహలు ప్రజలలో ఉన్నాయి. తాను ఇప్పటివరకు మద్యం తాగలేదన్నాడు. ఉరితీసే ముందు తాము మద్యం సేవించి వెళ్తామని భావిస్తారని, కానీ అవన్నీ అపోహలేనని స్పష్టంచేశాడు. తాడును చుట్టి లాగే సమయంలో చాలా జాగ్రత్తగా, సంయమనంతో ఉంటామని వివరించాడు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..