Paytm: రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్. పేటీఎం సరికొత్త ఆఫర్ ప్రకటించింది. చేతిలో డబ్బుల్లేకపోయినా..టికెట్ బుక్ చేసుకోవచ్చు. తరువాత చెల్లించవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆన్‌లైన్ వాణిజ్య వేదికలు ప్రవేశపెట్టే బై నౌ..పే లేటర్ ఇకపై రైల్వే టికెట్లకు కూడా వర్తించనుంది. పేటీఎం ఈ అద్భుతమైన సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. రైల్వే టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే..చేతిలో డబ్బుల్లేకపోయినా ఫరవాలేదు. ముందు టికెట్లు బుక్ చేసుకుని...తరువాత నెలలోగా డబ్బులు చెల్లించవచ్చు. ఐఆర్‌సీటీసీ వినియోగదారుల కోసం పేటీఎం పోస్టు పెయిడ్ సర్వీసుల్ని ప్రవేశపెడుతోంది. ముందుగా ఏ విధమైన చెల్లింపులు చేయకుండానే..టికెట్లు బుక్ చేయవచ్చు. యూజర్లు బై నౌ...పే లేటర్ ఆప్షన్ ద్వారా ఈ చెల్లింపులు జరపవచ్చు. టికెట్ బుకింగ్, యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, షాపింగ్ వరకూ ప్రతి అవసరాన్ని తీర్చేలా పే లేటర్ ఆప్షన్ ఉంటుందని పేటీఎం వివరించింది. 


వడ్డీ లేకుండా రుణాల్ని 30 రోజుల వరకూ 60 వేల వరకూ అందిస్తుంది. బై నౌ..పే లేటర్ విధానంలో కొనుగోలు చేసిన వస్తువులకు ఈఎంఐ కూడా వర్తిస్తుందని పేటీఎం తెలిపింది. 


Also read; Russia Ukraine War: యుద్ధాన్ని ఆపేందుకు భారత్ మధ్యవర్తిత్వం..? రష్యా విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook