PPO: కేంద్రం శుభవార్త.. పెన్షన్ కోసం ఇక ఆ సమస్య ఉండదు
Pension Payment Order Promises Ease Of Living For Senior Citizens: PPO: పెన్షన్ తీసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన వారు, లేక ఇప్పటికే ప్రతినెలా పింఛన్ తీసుకుంటున్నవారు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కోసం ఇకనుంచి ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఒక చిన్న క్లిక్‌తోనే పెన్షనర్లు పీపీఓను పొందవచ్చు.
Pension Payment Order Promises Ease Of Living For Senior Citizens: పెన్షన్ తీసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన వారు, లేక ఇప్పటికే ప్రతినెలా పింఛన్ తీసుకుంటున్నవారు పెన్షన్ పేమెంట్ ఆర్డర్(Pension Payment Order) కోసం ఇకనుంచి ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఒక చిన్న క్లిక్‌తోనే పెన్షనర్లు పీపీఓను ప్రింట్ ద్వారా పొందవచ్చు. ఈ సౌకర్యాన్ని పింఛన్‌దారులకు అందుబాటులోకి తేనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
కరోనా వ్యాప్తి సమయం నుంచి కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఎలక్ట్రానిక్ పీపీఓను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఇకనుంచి పెన్షనర్లు ఇంట్లో కూర్చుని పీపీఓను ఆన్‌లైన్‌లోనే పొందవచ్చు. వయసు పైబడిన పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పీపీఓ ఆర్డర్ చేతికి రాక ఇప్పటివరకూ ఎదురైన పెన్షన్(Pension) సమస్యలకు ఇక పరిష్కారం లభించింది.
Also Read: PM Kisan Samman Nidhi: రైతులకు సాయం రూ.10,000కు పెంపు.. బడ్జెట్‌లో ప్రకటన!
ఇకనుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత పీపీఓ తయారు అవుతుంది. ఇది చూపిస్తేనే వారికి ఏ సమస్య లేకుండా ప్రతినెలా పెన్షన్ అందుతుంది. ప్రస్తుతం డిజి లాకర్‌తో పింఛన్‌దారులు లేటెస్ట్ పీపీఓను పొందవచ్చు. డిజి-లాకర్‌తో అనుసంధానం చేసుకున్న పీఎఫ్‌ఎంఎస్ ద్వారా ఎలక్ట్రానిక్ పీపీఓ కాపీని పొందవచ్చు. అయితే పెన్షనర్లు భవిష్య అకౌంట్‌ను డిజి లాకర్ అకౌంట్‌తో అనుసంధానం చేసుకోవాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సూచించారు.
Also Read: Extra Data Offer: ఈ ప్లాన్స్‌తో 5 GB ఎక్స్‌ట్రా డేటా మీ సొంతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook