ఎట్టకేలకు తగ్గుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు..!
దేశీయ వినియోగదారులకు మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి సరకు ధరలు తగ్గడంతో వాటి ప్రభావం భారతదేశంలోని పెట్రోల్, డీజిల్ ధరల పై కూడా కనిపిస్తోంది.
దేశీయ వినియోగదారులకు మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి సరకు ధరలు తగ్గడంతో వాటి ప్రభావం భారతదేశంలోని పెట్రోల్, డీజిల్ ధరల పై కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం దేశ రాజధానిలో పెట్రోల్ ధర రూ.80 కంటే తక్కువగా నమోదవ్వడంతో పలువురు ఆశ్చర్యపోయారు. ప్రస్తుత సమాచారం ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ రూ.79.75 ధరగా నమోదవ్వగా.. డీజిల్ రూ. 73.85గా నమోదైంది. కానీ ముంబయిలో మాత్రం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇంకా పెట్రోల్ అక్కడ రూ. 85.24లకే లభిస్తోంది.
ప్రస్తుత లెక్కల ప్రకారం... పెట్రోల్ ధర కోల్‌కతాలో రూ. 81.63, చెన్నైలో రూ. 82.86, హైదరాబాద్‌లో రూ. 84.54కు చేరడం గమనార్హం. అయితే రెండు, మూడు రోజులలో ఈ ధరలు తగ్గే అవకాశం కూడా కనిపిస్తోందని తెలుస్తోంది. గత వారం రోజులుగా ఇంధనం ధరల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. దాదాపు పెట్రోల్ పై రూ.3 వరకు తగ్గగా.. డీజిల్ పై కూడా రూ.1.84 తగ్గడం గమనార్హం. అంతకు ముందు పెట్రల్ ధరలు ఏ స్థాయిలో పెరిగాయో అందరికీ తెలిసిన విషయమే.
అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధర 77.66 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండడంతో.. దాని ప్రభావం ఇతర దేశాల మీద కూడా పడింది. ఈ నెలలో బ్యారెల్ ధర 86 డాలర్లకు పైగానే ట్రేడ్ అయ్యింది. కనుక, దాని ప్రభావం భారత్‌లోని పెట్రోల్, డీజిల్ ధరల పై పడిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.