ఇవాళ కూడా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ : వాహనదారులకు స్వల్ప ఊరటనిస్తూ ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా తగ్గుముఖం పట్టాయి. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర .15 పైసలు తగ్గి రూ. 77.28కు చేరుకోగా, డీజిల్ ధర 10 పైసలు తగ్గి రూ. 72.09కు చేరింది. ఇవాళ హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 32 పైసలు తగ్గి రూ. 82. 54కు చేరుకోగా, డీజిల్ ధర 22 పైసలు తగ్గి రూ. 78.32 కు చేరుకుంది. ఇక ఈ ఏడాదిలో దేశంలోనే అత్యధిక ధరలతో చుక్కలు చూపించిన ముంబైలో నేడు లీటర్ పెట్రోల్ ధర రూ.82.80, డీజీల్ ధర రూ.75.53గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 7% పడిపోవడం ఇంధనం ధరల తగ్గుదలకు ఓ కారణమైతే, డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ క్రమేణా బలపడుతుండటం మరో కారణంగా మార్కెట్ వర్గాలు తెలిపాయి.