Narendra Modi on Reducing Petrol Diesel Price: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రజలే ఎప్పుడూ తమ మొదటి ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఇవాళ కేంద్రమంత్రి ప్రకటించిన నిర్ణయాల్లో... ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు దేశ ప్రజలకు ఊరటనిస్తుందన్నారు. ఈ నిర్ణయం ప్రజల జీవితాలను సులభతరం చేయడంలో దోహదపడుతుందన్నారు. ఇతర రంగాలపై కూడా ఇది సానుకూల ప్రభావం చూపుతుందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.200 సబ్సిడీ ఇవ్వాలనే నిర్ణయం ఫ్యామిలీ బడ్జెట్స్‌ను సులభతరం చేస్తుందని మోదీ పేర్కొన్నారు. ఉజ్వల యోజన పథకం ద్వారా కోట్లాది మంది భారతీయులకు... ముఖ్యంగా మహిళలకు లబ్ది చేకూరుతోందన్నారు.


కాగా.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. లీటర్ పెట్రోల్‌పై రూ.8 మేర, లీటర్ డీజిల్‌పై రూ.6 మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. దీంతో లీటర్ పెట్రోల్‌పై రూ.9.5, లీటర్ డీజిల్‌పై రూ.7 మేర ధర తగ్గింది. ఈ నిర్ణయంతో కేంద్ర ఖజానాపై వార్షికంగా రూ.1లక్ష కోట్ల భారం పడనుంది. 


దేశంలోని పేద, సామాన్య ప్రజలకు సాయపడాలనే ప్రధాని నరేంద్ర మోదీ నిబద్దతకు అనుగుణంగా ఇవాళ పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సున్నితత్వంతో పనిచేయాలని... సామాన్యుడికి రిలీఫ్‌గా నిలవాలని ప్రధాని సూచించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించి కామన్ మ్యాన్‌కి రిలీఫ్‌ ఇవ్వాలని నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి చేశారు. 




Also Read: Petrol Diesel Price: ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుపై కాంగ్రెస్ రియాక్షన్... దేశానికి 'జుమ్లా'లు అక్కర్లేదంటూ సెటైర్   


Also Read: Petrol, Diesel Prices: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీ తగ్గింపు


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook