వరుసగా నాలుగో రోజూ తగ్గిన ఇంధన ధరలు
పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజూ తగ్గాయి.
ఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజూ తగ్గాయి. శనివారం కూడా లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 9 పైసలు తగ్గాయి. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు తగ్గడం, డాలర్‌పై రూపాయి విలువ పెరగడం వంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.78.20కు, లీటర్ డీజిల్ రూ.69.11కు చేరుకుంది. తగ్గించిన ఈ ధరలు ఆయా రాష్ట్రాల వ్యాట్ లేదా స్థానిక్ అమ్మకపు పన్నును బట్టి మారుతాయి.
శనివారం ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు:
నగరం | పెట్రోల్/లీటర్ | డీజిల్/లీటర్ |
ఢిల్లీ | 78.20 | 69.11 |
ముంబాయి | 86.01 | 73.58 |
కోల్‌కతా | 80.84 | 71.66 |
చెన్నై | 81.19 | 72.97 |
హైదరాబాద్ | 82.88 | 75.16 |
వరుసగా 16రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం నుంచి రూ. పైసల్లో తగ్గుతూ వస్తున్నాయి. బుధవారం లీటర్ పెట్రోల్ మీద ఒక్క పైసా, గురువారం 6 పైసలు, శుక్రవారం7 పైసలు తగ్గించారు. కాగా మే 14 నుంచి వరుసగా 16రోజుల పాటు పెట్రోల్ లీటరుకు రూ.3.8, డీజిల్ లీటరుకు రూ.3.38 చొప్పున పెరిగాయి.