కర్ణాటక ఎన్నికలు ముగియడంతో ఇంధన ధరల పెరుగుదల మొదలైంది. 19 రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం పెరిగాయి. పెట్రోల్ పై 20 పైసలు, డీజిల్ పై 18 పైసల చొప్పున పెంచాయి. హైదరాబాద్ లో పెట్రోల్ ధర ఇవాళ లీటర్ పై 19 పైసలు పెరగగా.. డీజిల్ ధర 26 పైసలు పెరిగింది. ఈ లెక్కన హైదరాబాద్ లో పెట్రోల్ లీటర్ ధర రూ.79.23కు చేరగా.. డీజిల్ ధర రూ.71.89గా ఉంది. ఆయా ప్రాంతాలను బట్టి 2, 3పైసలు అటూ ఇటూ ఉంటుంది ఈ ధర.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుజరాత్ ఎన్నికల సమయంలో రోజూ ధరలను తగ్గిస్తూ వచ్చి ఆ తరువాత పెంపు మొదలుపెట్టిన చమురు సంస్థలు.. ఈ ఎన్నికల్లో కేంద్ర మౌఖిక ఆదేశాలతో రోజూవారీ ధరల సవరణనే ఆపేశాయి. అయితే ఇకపై రోజువారీ బాదుడుకు 19 రోజుల విరామాన్ని కలిపి భారం వేస్తారని సమాచారం. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో.. తగ్గుదల ఇప్పట్లో ఉండే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు ఆర్థిక విశ్లేషకులు.