Petrol Diesel: రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో సతమతమవుతున్న వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇంధన ధరలను కొద్ది మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌ లీటర్‌కు రూ.2 చొప్పున తగ్గిస్తూ కేంద్ర చమురు శాఖ ప్రకటన విడుదల చేసింది. తగ్గించిన ఇంధన ధరలు శుక్రవారం ఉదయం నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఈ ప్రకటనతో వాహనదారులు కొంత ఊరట చెందారు. రాష్ట్రాలను బట్టి ఇంధన ధరల్లో వ్యత్యాసాలు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ దాదాపు రూ.వంద నుంచి 110 దాకా ఉండగా.. డీజిల్‌ కూడా దాదాపు అదే స్థాయిలో రూ.80 నుంచి రూ.100 దాకా ఆయా ప్రాంతాల్లో ఉంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: MP Candidates: అంతుచిక్కని కేసీఆర్‌ వ్యూహం.. మరో రెండు లోక్‌సభ స్థానాలకు కొత్త వ్యక్తులు


 


తగ్గించిన ధరలతో 58 లక్షల భారీ వాహనాలకు, 6 కోట్ల కార్లకు, 27 వాహనాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రకటించాయి. ఈ ధరల తగ్గింపు పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్‌ సింగ్‌ పూరి స్పందించారు. 'మరోసారి నరేంద్ర మోదీ పేదల పక్షపాతి అని చాటుకున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.2 చొప్పున తగ్గింపుతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది' అని ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా సుదీర్ఘమైన పోస్టు 'ఎక్స్‌'లో చేశారు. ఆ సందేశంలో ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. 

Also Read: Mamata Banerjee Injury: పశ్చిమ బెంగాల్‌లో కలకలం.. సీఎం మమతా బెనర్జీకి తీవ్ర గాయం.. అసలేం జరిగింది?


 


ఎన్నికల గిఫ్ట్‌?
ఒకటి, రెండు రోజుల్లో లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడనుంది. ఈ సమయంలో ప్రజలకు చిన్న కానుక బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇచ్చింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇంధన ధరలు అనూహ్యంగా పెరిగాయి. గతంలో ఉన్న ధరల విధానాన్ని రద్దు చేసి రోజు ఇంధన ధరల్లో మార్పులు జరిగేలా నిర్ణయం తీసుకుంది. దీనిఫలితంగా లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.120 వరకు పెరిగింది. ఇక డీజిల్‌ రూ.వందకు చేరువైంది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా కొంత ధరలు తగ్గిస్తూ వచ్చింది. ఫలితంగా ప్రస్తుతం రూ.110కి పెట్రోల్‌, రూ.వందకు చేరువగా డీజిల్‌ ధరలు కొనసాగుతున్నాయి. ఇక ఎన్నికల సమయం కావడంతో ధరలు పెరగడం అనేది ఉండదు.


అయితే తాజాగా తగ్గించిన ఇంధన ధరలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ధరల తగ్గింపు ఎన్నికల జిమ్మిక్కు అని విమర్శిస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈ తాయిలం ప్రకటించిందని మోదీ సర్కార్‌పై కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. తగ్గిన ధరలపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందన లభిస్తోంది. చాలా మంది ధరల తగ్గింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరల తగ్గింపు మీమ్స్‌ వైరల్‌గా మారాయి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter