PF Account: పీఎఫ్ ఖాతాదారుల కోసమే ఈ సూచన. మీ ఖాతాలకు సంబంధించి కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఇక మీ పీఎఫ్ ఖాతాపై కూడా పన్ను వేటు తప్పదు. ఆ వివరాలు పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్యాంకింగ్, ఐటీ, పీఎఫ్ ఇలా వివిధ అంశాలకు సంబంధించి కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. ఏయే అంశాల్లో ఏయే మార్పులు జరిగాయో తెలుసుకోకపోతే భారీ జరిమానా తప్పదు. ముఖ్యంగా పీఎఫ్ ఖాతాకు సంబంధించి కొత్త నిబంధనలు పక్కాగా ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్నాయి. అంటే ఇక నుంచి పీఎఫ్ ఖాతాలో డబ్బులకు కూడా ట్యాక్స్ పడనుంది. 


మీ పీఎఫ్ ఖాతాల్లో 2.25 లక్షల వరకూ జమయ్యే నగదుపై పన్ను విధించనుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిప్రకారం పీఎఫ్ ఖాతాలో ఏడాదిలో 5 లక్షలకు జమ చేస్తే..2 లక్షల 50 వేలకు పన్ను విధించనున్నారు. అదే విధంగా మిగిలిన మొత్తం పన్ను పరిధిలోకి రాకుండా ఉంటుంది. ప్రభుత్వ రంగాల్లో పనిచేసే ఉద్యోగి ప్రోవిడెంట్ ఫండ్ ఏడాదికి 6 లక్షలు జమ చేస్తే...లక్ష రూపాయలు మాత్రమే ట్యాక్స్ పరిధిలో వచ్చే ఆదాయంగా లెక్కిస్తారు. మిగిలిన మొత్తం పన్ను లేకుండా ఉంటుంది. 


ఈ కొత్త నిబంధలు వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి పీఎప్ ఖాతాలు ట్యాక్సెబుల్, నాన్ ట్యాక్సెబుల్ పేర్లతో రెండుగా విడిపోతున్నాయి. 2021 మార్చ్ 31కు క్లోజ్ అయ్యే ఖాతాలకు కూడా ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం ఏడాది పీఎఫ్ నగదు 2.5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇక నుంచి 2.5 లక్షల కంటే ఎక్కువ పీఎఫ్ నగదు ఉంటే..రెండు ప్రత్యేకమైన ఎక్కౌంట్లు క్రియేట్ చేసుకోవాలి. 


Also read: Indian Railways New Rules: రైల్వే ప్రయాణంలో కొత్త నిబంధనలు, మర్చిపోతే జరిమానానే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook