PF Account transfer: మీ పీఎఫ్ ఎక్కౌంట్ ఆన్‌లైన్‌లో బదిలీ చేయడం ఎలా
PF Account transfer: ప్రభుత్వ ఉద్యోగమైనా లేక ప్రైవేట్ ఉద్యోగమైనా అందరికీ ఈపీఎఫ్ ఎక్కౌంట్ అనేది కామన్. ప్రైవేట్ ఉద్యోగులు కంపెనీ మారినప్పుడు ఈపీఎఫ్ ఎక్కౌంట్ అనేది బదిలీ అవుతుంది. ఈపీఎఫ్ ఎక్కౌంట్‌తో పాటు ఈపీఎస్ ఎస్కౌంట్ కూడా బదిలీ కావల్సిన అవసరముంది. అదెలాగో తెలుసుకుందాం.
PF Account transfer: ఈపీఎస్ అంటే ఎంప్లాయి పెన్షన్ స్కీమ్. ఇది ఒకవేళ మారకపోతే పీఎఫ్ విత్‌డ్రా చేసేటప్పుడు సమస్యలు లేదా ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఒకవేళ ఈపీఎఫ్ నగదు విత్‌డ్రా చేయగలిగినా పెన్షన్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. అందుకే మీ కోసం ఈ వివరాలు..ఈపీఎఫ్ ఎక్కౌంట్ సులభంగా ఆన్‌లైన్‌లో ఎలా బదిలీ చేసుకోవచ్చో తెలుసుకుందాం..
ఈపీఎఫ్ ఎక్కౌంట్ సులభంగా ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్ విధానంలో బదిలీ చేసేందుకు ముందుగా మెంబర్ ఇ సేవా పోర్టర్ ఓపెన్ చేయాలి. దీనికోసం మీక్కావల్సింది యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్. లాగిన్ అయిన తరువాత వన్ మెంబర్ వన్ ఈపీఎఫ్ ఆన్‌లైన్ సర్వీస్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పీఎఫ్ ఎక్కౌంట్, వ్యక్తిగత సమాచారం వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు గెట్ డీటైల్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇందులో మీ పాత ఎక్కౌంట్ వివరాలు కన్పిస్తాయి.
ఎంప్లాయర్ ఎవరో ఎంచుకుని మెంబర్ ఐడీ లేదా యూఏఎన్ నెంబర్ సమకూర్చాలి. ఇప్పుడు మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీతో ధృవీకరించి సబ్మిట్ చేయాలి. చివరిగా ఫామ్ 13 ప్రింట్ అవుట్ తీసుకుని సంతకం చేసి ఉంచుకోవాలి. ఈ ఫామ్‌ను 10 రోజుల్లోగా మీ ఎంప్లాయర్‌కు సమర్పించాలి. ఆ తరువాత మీ పీఎఫ్ ఎక్కౌంట్ బదిలీ అవుతుంది. పెన్షన్ ఎక్కౌంట్ కూడా బదిలీ అవుతుంది.
Also read: Weight Loss Remedy: రోజూ ఈ నీళ్లు ఇలా తాగితే అధిక బరువు సమస్య మాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.