PF Money Withdrawal: పీఎఫ్ నగదు అడ్వాన్స్ విత్ డ్రా ఎలా చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఇలా
PF Money Withdrawal: ప్రభుత్వ , ప్రైవేటు ఉద్యోగులకు తప్పనిసరి పీఎఫ్ ఎక్కౌంట్. నెల నెలా ఇటు ఉద్యోగి అటు యజమాని నుంచి కొద్దిమొత్తం ఫీఎఫ్ ఖాతాలో జమ అవుతుంటుంది. ఎప్పుడైనా అవసరం వస్తే పీఎఫ్ డబ్బులు అడ్వాన్స్‌గా విత్ డ్రా చేసుకోవచ్చు. అదెలాగో పూర్తి ప్రక్రియ తెలుసుకుందాం.
PF Money Withdrawal: మెడికల్ ఎమర్జెన్సీ, పిల్లల చదువులు లేదా ఇంటి కొనుగోలు కోసం పీఎఫ్ డబ్బుల్ని మెచ్యూరిటీ కంటే ముందే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈపీఎప్ఓ సంస్థ ఖాతాదారులకు ఎప్పటికప్పుడు ఈ విషయమై అప్‌డేట్స్ అందిస్తోంది. అందులో భాగంగా అవసరమైనప్పుడు పీఎఫ్ డబ్బుల్ని విత్‌డ్రా చేసుకునే సౌకర్యం. మరి ఈ ప్రక్రియ ఎలా అనేది చూద్దాం.
ప్రోవిడెంట్ ఫండ్ లేదా ఈపీఎఫ్ అనేది ఉద్యోగి భవిష్యత్ సంరక్షణకు ఉపయోగపడే నిధి. ఉద్యోగి కనీస వేతనం నుంచి ప్రతి నెలా 12 శాతం జమ అవుతుంటుంది. అదే మొత్తంలో లేదా కనీసం 8.33 శాతం యాజమాన్య సంస్థ నుంచి చెల్లిస్తుంటారు. దీనిపై ఏడాదికోసారి వడ్డీ జమ అవుతుంది. మెచ్యూరిటీ తరువాత లేదా ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ నగదు ఉపసంహరించుకోవచ్చు లేదా వేరే సంస్థకు బదిలీ చేసుకోవచ్చు. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితులుంటే మాత్రం అడ్వాన్స్ రూపంలో కొద్దిమొత్తం తీసుకోవచ్చు.
మెడికల్ ఎమర్జెన్సీ, ఇంట్లో పెళ్లి, పిల్లల చదువు, ఇంటి కొనుగోలు వంటి విషయాలకు పీఎఫ్ డబ్బుల్ని ముందుగా క్లెయిమ్ చేయవచ్చు. ఈపీఎఫ్ నగదును ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో క్లెయిమ్ చేయవచ్చు. ఆన్‌లైన్ అయితే ఈపీఎఫ్ అధికారిక వెబ్‌సైట్ లేదా ఉమంగ్ యాప్ ద్వారా చేయవచ్చు. మీక్కావల్సిందల్లా యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్ అవసరం. అప్లై చేసిన వారం రోజుల్లోనే మీ ఎక్కౌంట్‌లో కోరిన నగదు బదిలీ అవుతుంది.
ఇక ఆఫ్‌లైన్ విదానంలో కూడా పీఎఫ్ నగదు బదిలీ చేయవచ్చు. అయితే దీనికి బ్యాంక్ ఎక్కౌంట్, ఆధార్ ఎక్కౌంట్ వివరాలు యూఏఎన్ పోర్టల్‌లో అప్‌డేట్ అయుండాలి. సమీపంలోని ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లి వివరాలు సమర్పించి పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకోవచ్చు.
Also read: Jamili Elections: జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీల వైఖరేంటి, ఏ పార్టీలు అనుకూలం, ఏవి వ్యతిరేకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.