Sabarimala pilgrimage suspended for a day due to rain: కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయానికి భక్తుల రాకను నిలిపివేసింది స్థానిక యంత్రంగాం, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా.. పంబా సహా స్థానికంగా ఉన్న నదుల్లో నీటి మట్టం పెరుగుతుండటం కారణంగా యాత్రికుల భద్రత కోసం ఈ నిర్ణయం (Sabarimala pilgrimage Suspended) తీసుకున్నట్లు పతనం తిట్ట జిల్లా కలెక్టర్ వ్య ఎస్ అయ్యర్ వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భక్తులెవరు సందర్శనం కోసం ఆలయంవైపు రావొద్దని కోరారు. వరద ఉదృతి (Kerala Floods) తగ్గగానే.. అయ్యప దర్శనానికి అనుమతినిస్తామని స్పష్టం చేశారు. శనివారం దర్శనం కోసం ఆన్​లైన్​లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి.. కూడా అవకాశమిస్తామని తెలిపారు.
కక్కి అనథోడ్​ రిజర్వాయర్​, పంబా డ్యామ్ రెండు ప్రస్తుతం రెండ్ అలర్ట్​లో ఉన్నాయని స్థానిక యంత్రాంగం వెల్లడించింది.


ఇటీవలే తెరుచున్నఆలయం..


మండల మకరవిళక్కు పండగ సందర్భంగా ఈ నెల 15 నుంచి శబరిమల ఆలయం తెరుచుకుంది. రెండు నెలల పాటు భక్తులు సందర్శించేందుకు వీలుంది. వర్చువల్​ క్యూ విధానంలో సందర్శనాలు అనుమతిస్తున్నారు. రోజుకు 30 వేల మంది భక్తులను అనుమతిస్తున్నారు.


Also read: రైళ్లలో దూరప్రయాణాలు చేసే వారికి గుడ్​ న్యూస్​- ఆహార సేవలు పునఃప్రారంభం!


Also read: వైరల్ వీడియో... సాగు చట్టాలపై రాహుల్ గాంధీ గతంలో చెప్పిందే నిజమైంది...


2022 జనవరి 14 మకరజ్యోతి దర్శనం తర్వాత.. ఆరు రోజుల పాటు మాత్రమే దర్శనాలు అందుబాటులో ఉండనున్నాయి. ఆ తర్వాత జనవరి 20 ఆలయం మూసెయనున్నారు.


ప్రస్తుతం కొవిడ్ నిబంధనలతోనే ఆలయంలో దర్శనాలకు అనుమతినిస్తున్నారు అధికారులు. కనీసం 72 గంటల లోపు కొవిడ్ ఆర్​టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ అయినా ఉంటేనే దర్శనం చేసుకునే వీలుంది.


Also read: మందు బాబులు నిజాలే తప్ప అబద్దాలు చెప్పరు... ఎక్సైజ్ అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు...


Also read:  తమిళనాడు: భారీ వర్షాలకు కుప్పకూలిన ఇల్లు...నలుగురు చిన్నారులతో సహా 9 మంది మృతి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook