మందు బాబులు నిజాలే తప్ప అబద్దాలు చెప్పరు... ఎక్సైజ్ అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు...

Excise officer comments: మందు తాగేవాళ్లు నిజాలే తప్ప అబద్దాలు చెప్పరంటూ మధ్యప్రదేశ్‌కి (Madhya Pradesh) చెందిన ఓ ఎక్సైజ్ ఆఫీసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మద్యం కొనుగోలుకు లిక్కర్ షాపుల వద్దకు వెళ్లేవారు వ్యాక్సిన్ సర్టిఫికెట్ చూపించాల్సిన అవసరం లేదన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2021, 03:58 PM IST
  • మందుబాబులపై మధ్యప్రదేశ్ అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు
    మందు తాగేవారు నిజాలే తప్ప అబద్దాలు చెప్పరని కామెంట్
    మందు బాబులు వ్యాక్సిన్ సర్టిఫికెట్ చూపించాల్సిన పని లేదని వ్యాఖ్యలు
మందు బాబులు నిజాలే తప్ప అబద్దాలు చెప్పరు... ఎక్సైజ్ అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు...

Excise officer comments : మద్యం సేవించేవారు అబద్దం చెప్పరంటూ మధ్యప్రదేశ్‌కి (Madhya Pradesh) చెందిన ఓ ఎక్సైజ్ ఆఫీసర్ మందుబాబులకు సర్టిఫికెట్ ఇస్తున్నాడు. మద్యం దుకాణాల వద్ద వ్యాక్సిన్ సర్టిఫికెట్ చూపించినవారికే మద్యం విక్రయించాలన్న నిబంధనపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'వాళ్లు ఎటువంటి వ్యాక్సిన్ సర్టిఫికెట్లు చూపించాల్సిన అవసరం లేదు. తాము రెండు డోసుల వ్యాక్సిన్ (Covid vaccination) తీసుకున్నది లేనిది వారు చెప్పగలరు. ఎందుకంటే మద్యం తాగేవాళ్లు అబద్దాలు చెప్పరు..' అని పేర్కొన్నారు.

కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో కొన్ని నిబంధనలు అమలుచేస్తున్నారు. ఇందులో భాగంగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికే మద్యం (Liquor sales) విక్రయించాలన్న నిబంధన అమలులోకి తెచ్చారు. దీనికి సంబంధించి మద్యం షాపుల వద్ద బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. దీంతో మద్యం కొనుగోలు చేయాలనుకునేవారు షాపు యజమానికి తమ వ్యాక్సిన్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్లు సర్టిఫికెట్ ఉంటేనే అతనికి మద్యం విక్రయిస్తారు. 

Also Read: మిస్టర్ 360 షాకింగ్ నిర్ణయం: అన్ని ఫార్మెట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీడివిలియర్స్

 

ఇదే అంశంపై స్థానిక ఎక్సైజ్ ఆఫీసర్ ఆర్పీ కిరర్ తాజాగా మీడియాతో మాట్లాడారు. మద్యం కొనుగోలు చేసేందుకు లిక్కర్ షాపుల వద్దకు వెళ్లేవారు తమ వ్యాక్సిన్ సర్టిఫికెట్ చూపించాల్సిన పని లేదన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నది లేనిది వారు నోటి మాటతో చెప్పగలరని.. తన వ్యక్తిగత అనుభవం ప్రకారం మందు తాగేవాళ్లు నిజమే చెప్తారని... అబద్దం చెప్పరని పేర్కొన్నారు. సదరు అధికారి వ్యాఖ్యలను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 'మందు తాగేవారు అబద్దాలు చెప్పరా... వాట్ ఏ లాజిక్...' అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ అధికారి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది. ఇప్పటివరకూ మధ్యప్రదేశ్‌లోని 52 జిల్లాల్లో 7.88 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. ఖండ్వా జిల్లాలో దాదాపు 13.86 లక్షల డోసులు పంపిణీ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News