PK Joining Congress: 2024 జనరల్‌ ఎలక్షన్సే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ చకచకా పావులు కదుపుతున్నది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఘోర ఓటమి తర్వాత కాంగ్రెస్‌ పార్టీ గేరు మార్చింది. 2024లో కచ్చితంగా అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్‌ ప్రశాంత్‌ కిషోర్‌ తో చేతులు కలిపింది. పీకే కూడా కాంగ్రెస్‌ తో జరిపిన చర్చల పట్ల సంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే నాలుగైదు రోజుల్లోనే పీకే కాంగ్రెస్‌ లో చేరే అవకశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొత్తానికి అందరూ ఊహించిందే జరిగింది. పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్‌ ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్‌ లో చేరేందుకు రంగం సిద్ధమైంది. రెండు రోజుల పాటు జరిగిన చర్చల తర్వాత ప్రశాంత్‌ కిషోర్‌ త్వరలోనే కాంగ్రెస్‌ లో జాయిన్‌ కావాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ ను ఏ విధంగా బలోపేతం చేయాలో వివరిస్తూ.. పీకే దాదాపు గా 600 స్లైడ్స్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ రూపంలో ప్రదర్శించాడు.  


 శుక్రవారం ప్రశాంత్‌ కిషోర్‌ మరికొందరితో చర్చలు జరపన్నారు. పార్టీ ప్రెసిడెంట్‌ సోనియాగాంధీ,  రాహుల్‌ గాంధీ, పార్టీ జాతీయ సెక్రటరీ ప్రియాంక గాంధీతో కూడా డీటెయిల్డ్‌ డిస్కస్‌ చేయనున్నారు. ఆ చర్చల తర్వాతే పీకే కాంగ్రెస్‌ లో ఎప్పుడూ జాయిన్‌ అవుతారో ఓ క్లారిటీ రానుంది. ఇప్పటికే సోనియాగాంధీని ప్రశాంత్‌ కిషోర్‌.. ఈ నెల 16, 18 తేదీల్లో కలిశారు. ఆ తర్వాతే సోనియాగాంధీ ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ కమిటీయే పీకే ప్రదర్శించిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ను వీక్షించింది. అటు ఈ సంవత్సరం జరిగే గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనుసరించాల్సిన వ్యుహాలపై కూడా పీకే అగ్రనాయకత్వానికి దిశానిర్దేశం చేస్తున్నారు. అటు ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమిపై కూడా విశ్లేషించారు.




ఇప్పటికే ప్రశాంత్‌ కిషోర్‌ 2024 ఎన్నికలకు సంబంధించి డీటెయిల్డ్‌ రోడ్‌ మ్యాప్‌ ఇచ్చాడని పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ చెప్పారు. పీకే ఇచ్చిన ప్రజెంటేషన్‌ ప్రకారం ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఒడిశా లో కాంగ్రెస్‌ ఒంటరిగానే పోటీచేయాల్సి ఉంటుంది. తమిళనాడు, పశ్చిమబెంగల్‌, మహారాష్ట్రలో పొత్తులు కుదుర్చుకునేందుకు రాహుల్‌ గాంధీ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం అందుతోంది. పీకే రిపోర్టు ప్రకారం కాంగ్రెస్‌ తప్పకుండా.. 370 లోక్‌ సభ స్థానాలపై కచ్చితమైన ఫోకస్‌ పెట్టాల్సి ఉంటుంది.


Also Read: Afghanistan Blast: అఫ్గానిస్థాన్ లో వరుస పేలుళ్లు.. 18 మంది మృతి, పలువురికి గాయాలు!


Also Read:Anasuya Bharadwaj: అనసూయ నయా లుక్.. ఫ్యాషన్ డ్రెస్ అందాలతో కుర్రాళ్ల మతిపోగొడుతోందిగా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook