Planet Parade 2022: మానవులు జన్మించక ముందే ఆకాశం ఏర్పడిందని ఖగోళ శాస్త్రం చెబుతోంది.  ఖగోళ శాస్త్రంలోని అంతరిక్షంలో వింత వింత విషయాలను పేర్కొంది. ఖగోళ శాస్త్రాన్ని మరో రకంగా అంతరిక్షశాస్త్రం అని కూడా అంటారు. అకాశంలో కనిపించే ప్రతిది ఈ శాస్త్రం వివరిస్తుంది. ఖగోళ శాస్త్రంలో లేని ఘటన ఇటీవలే కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఆకాశంలో చోటు చేసుకుంది. ఖగోళంలో ఎవరు ఉహించని రీతిలో ఒకే రేఖపై పలు గ్రహాలు దర్శనమిచ్చాయి. అయితే ఖగోళ శాస్త్రవేత్తలు మాత్రం ఒకే రేఖపై నాలుగు గ్రహాలు వచ్చాయని తెలిపారు. ఈ అద్భుత ఘట్టాన్ని ఖగోళ శాస్త్రంలో ప్లానెట్స్‌ పరేడ్‌గా పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఈ వింత బుధవారం రోజున ఉదయం 3.49 గంటల నుంచి 5.07 మధ్య చోటు చేసుకుంది. దీని పై ఆస్ట్రనామికల్‌ వింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌.సాయి సందీప్‌  స్పందించి.. పలు ఆసక్తికర విషయాలను ప్రజలతో పంచుకున్నారు. మూడు గ్రహాలైన శని, అంగారక, శుక్ర మార్చిలో ఒక రేఖపైకి వచ్చాయని తెలిపారు. ఈ వింతను మొదట స్పార్క్‌ ఫౌండేషన్‌ చిత్రీకరించిందని పేర్కొన్నారు. అదే రేఖపై ఈ నెల 23న చంద్రుడు కూడా వచ్చే అవకాశాలున్నాయని..ఇది జరిగితే మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుందన్నారు. అయితే నాలుగు గ్రహాలు ఒకే రేఖపైకి రావటం అరుదన్నారు. ఏప్రిల్‌ నెలలో బృహస్పతి గ్రహం కూడా ఆ మూడు గ్రహాలున్న చోటికే  చేరింది. ఈ ఐదు గ్రహాలను ఒకే సారి చూడడం చాలా అరుదని ఆయన తెలిపారు.



ఇంతక ముందు ఖగోళంలో జరిగిన మరో ఘటన:


ప్రస్తుతం ఎన్ని గ్రహాలున్నాయన్న సంగతి శాస్త్రవేత్తలకు కూడా తెలయదంటే...ఆశ్చర్యమే. ఎందుకంటే నూతన గ్రహాలు క్రమంగా పుట్టుకొస్తున్నాయి.  గతంలో ఖగోళంలో ఓ వింత సంఘటన అందరికీ తెలిసిందే. మునుపెన్నడు జరగని, ఎవ్వరు ఊహించని రీతిలో ఒక గ్రహం ఏర్పడింది. దీంతో శాస్త్రవేత్తలు గ్రహాలు, ఉప గ్రహాలపై నిరంతరం సాధన చేస్తునే ఉన్నారు. నాసా జరిపిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలకు కొన్ని దృశ్యలు కనిపించాయి. అయితే తాజాగా నాసా శాస్త్రవేత్తలకు అంతరిక్షంలో నమ్మలేని దృశ్యం కనిపించింది. అంతరిక్షంలో సరికొత్త గ్రహం ఒకటి తయారవుతోంది. ఈ దృశ్యాలను నాసా హబుల్ టెలిస్కోప్ ద్వారా కనుగొంది. ఈ గ్రహం జూపిటర్ కన్న పెద్దగా ఉంటుందని వారు వెల్లడించింది. ఏబీ ఔరిగేయి బీగా ఈ గ్రహానికి వారు నాయకరణం కూడా చేశారు.  ఈ ఏబీ ఔరిగేయి బీ గ్రహం జూపిటర్ కన్నా 9 రేట్లు పెద్దగా ఉందని నాసా వెల్లడించింది. ఈ గ్రహానికి సంబంధించిన పలు ఫొటోలను నాసా విడుదల చేసింది.  


Also Read: Mahabubabad: పట్టపగలు టీఆర్ఎస్ నేత దారుణ హత్య... గొడ్డళ్లతో నరికి చంపిన దుండగులు..


Also Read: AP CM convoy Issue: సీఎం కాన్వాయ్ కోసం కారు లాక్కున్న అధికారులు.. జగన్ ఆదేశాలతో ఇద్దరిపై వేటు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.