దిల్లీలో మరో రెండ్రోజుల్లో ప్లాస్మా బ్యాంకు
కరోనా కట్టడికి ( corona ) దిల్లీ ప్రభుత్వం ( Delhi govt ) శాశ్వత చర్యలు చేపడుతోంది. కరోనా చికిత్సలో సానుకూల ఫలితాలిస్తున్న ప్లాస్మా థెరపీను ( Plasma Therapy ) అందరికీ అందుబాటులో తీసుకురావడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం ( Delhi Cm kejriwal ) ప్రయత్నిస్తోంది.
కరోనా కట్టడికి ( corona ) దిల్లీ ప్రభుత్వం ( Delhi govt ) శాశ్వత చర్యలు చేపడుతోంది. కరోనా చికిత్సలో సానుకూల ఫలితాలిస్తున్న ప్లాస్మా థెరపీను ( Plasma Therapy ) అందరికీ అందుబాటులో తీసుకురావడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం ( Delhi Cm kejriwal ) ప్రయత్నిస్తోంది.
కరోనా కు అందుబాటులో ఉన్న రకరకాల చికిత్సా విధానాల్లో చెెప్పుకోదగ్గది ప్లాస్మా థెరపీ. వాస్తవానికి ఈ విధానం అతి పాతదే అయినా...కరోనా చికిత్సలో సత్ఫలితాలనిస్తుండటంతో అన్ని దేశాలు దీన్ని అవలంభిస్తున్నాయి. దిల్లీలో కరోనా అతివేగంగా సంక్రమిస్తున్న నేపధ్యంలో ప్లాస్మా థెరపీను అందరికీ అందుబాటులో తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ( cm aravind kejriwal ) రంగంలో దిగారు. ప్లాస్మా బ్యాంకును ఏర్పాటు చేస్తున్నారు. మరో రెండ్రోజుల్లో ఇది అందుబాటులోకి రానుందని దిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు.
అసలు ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి
కరోనా సోకి చికిత్సలో కోలుకున్న వ్యక్తి నుంచి రక్తాన్ని సేకరిస్తారు. అందులోని ప్లాస్మాను వేరు చేసి భద్రపరుస్తారు. ఈ ప్లాస్మా కణాల్ని కరోనా సోకిన వ్యక్తికి అందించి చికిత్స అందిస్తారు. దీని కోసం కరోనా సోకి కోలుకున్న వ్యక్తులు స్వచ్ఛంధంగా ప్లాస్మాను దానం చేయాల్సి ఉంటుంది. దీనికోసం స్వచ్ఛంధంగా ప్లాస్మా దాతలు తరలిరావాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇప్పటికే దిల్లీలో అతిపెద్ద కోవిడ్ 19 సెంటర్ ( World largest Covid 19 centre ) ఏర్పాటుతో పాటు ఇంటింటి సర్వే ముమ్మరమైంది. దిల్లీలో 29 మంది రోగులపై నిర్వహించిన ప్లాస్మా థెరపీలో మెరుగైన ఫలితాలొచ్చాయి. ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న ప్లాస్మా బ్యాంకు...ప్లాస్మా బ్యాంకుకు, రోగులకు మధ్య సంధానకర్తగా వ్యవహరించనుందని కేజ్రీవాల్ చెప్పారు. దిల్లీలో ఇప్పటివరకూ 83 వేలకు పైగా కరోనా కేసులు వెలుగు చూశాయి.