PM Kisan FPO: రైతులకు ముఖ్యగమనిక.. రూ.15 లక్షలు పొందండి ఇలా..
PM Kisan FPO Latest Update: పీఎం కిసాన్ ఎఫ్‌పీఓ యోజన కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.15 లక్షలు అందజేస్తోంది. వ్యవసాయ సంబంధిత వ్యాపారం ప్రారంభించేందుకు ఈ డబ్బును అందజేస్తోంది. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి..? ఎవరు అర్హులు..? పూర్తి వివరాలు ఇలా..
PM Kisan FPO Latest Update: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 14వ విడత నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు 13వ విడతల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద రూ.6 వేలను ఏడాదికి మూడు వాయిదాల్లో చెల్లిస్తోంది. వాయిదాకు రూ.2 వేల చొప్పున లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతోంది. 13వ విడత నిధులు ఫిబ్రవరి 26న విడుదలయ్యాయి. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులు లబ్ధిపొందుతున్నారు. ఏప్రిల్-జూలైలోపు 14వ విడతకు సంబంధించిన డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది.
ఈ పథకానికి కంటే ముందే రైతులు మరో లబ్ధిపొందవచ్చు. రైతులు కొత్త వ్యవసాయ వ్యాపారం ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.15 లక్షలను అందజేస్తోంది. కేవలం వ్యవసాయం సంబంధిత వ్యాపారానికి కోసమే పీఎం కిసాన్ ఎఫ్‌పీఓ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రైతు ఉత్పత్తిదారుల సంస్థకు రూ.15 లక్షలు అందజేస్తారు. మీరు ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందాలనుకుంటే.. 11 మంది రైతులు కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవాలి. వ్యవసాయ పరికరాలు, ఎరువులు, విత్తనాలు, మందులు కొనుగోలు సంబంధిత వ్యాపారం ప్రారంభించవచ్చు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?
==> నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
==> హోమ్ పేజీలో ఇచ్చిన ఎఫ్‌పీఓ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
==> ఇక్కడ 'రిజిస్ట్రేషన్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఫారమ్ ఓపెన్ అవుతుంది.
==> ఫారమ్‌లో అడిగిన సమాచారాన్ని జాగ్రత్తగా నింపండి.
==> ఆ తరువాత పాస్‌బుక్ లేదా క్యాన్సిల్ చేసిన చెక్ లేదా ఐడీని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
==> చివరగా సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
Also Read: MLC Kavitha: ఫేక్ చాట్‌లతో నా మీద దుష్ప్రచారం.. అతనెవరో నాకు తెలియదు: ఎమ్మెల్సీ కవిత
లాగిన్ ఇలా చేయాలి
==> నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
==> మీరు హోమ్ పేజీలో ఇచ్చిన ఎఫ్‌పీఓ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
==> ఇప్పుడు లాగిన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
==> ఆ తరువాత లాగిన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది
==> వినియోగదారు పేరు, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి
==> మీరు లాగిన్ అవుతారు.
Also Read: PPF Vs EPF: మీరు రిటైర్మెంట్‌కు ప్లాన్ చేస్తున్నారా..? వడ్డీ ఎక్కువ వచ్చే పథకాలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.