PM Kisan 14th Installment Date: అన్నదాతలకు కేంద్ర శుభవార్త అందించింది. పీఎం కిసాన్ 14వ విడత నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ నెల 27న లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయనుంది. ఒక్కొక్కరి అకౌంట్‌లలో రూ.2 వేలను జమ చేయనుంది. ఈ పథకం కింద ఏడాదికి రూ.6 వేలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే. రూ.2 వేలను మూడు వాయిదాల్లో అందజేస్తోంది. ఇప్పటికే 13వ విడతల్లో అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. ఈ ఏడాదికి సంబంధించిన మొదటి విడత ఫిబ్రవరి 27న కేంద్రం విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని డిసెంబర్ 2018లో ప్రారంభించింది. రైతులు పెట్టుబడి పెట్టేందుకు ఎలాంటి ఇబ్బందులు పడకుండకూడదనేది ఈ పథకం ప్రధాన లక్ష్యం. అవసరమైన రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడమేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ పథకం కేవలం పరిమిత భూమి కలిగిన రైతు కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుంది. ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం కింద లబ్ధి పొందిన రైతులు తమ పంటలకు అవసరమైన రసాయన ఎరువులు కొనుగోలు చేసేందుకు వినియోగించాలని సూచించింది.


అయితే ఈ పథకానికి అర్హులైన రైతులు కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముందుగా తమ బ్యాంక్‌ అకౌంట్‌లను ఆధార్‌తో లింక్ చేసింది ఉండాలి. ఆధార్‌లను తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. కేవైసీ చేయని వారికి ఖాతాల్లో ప్రధాన మంత్రి కిసాన్ యోజన డబ్బులు పడవని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. 14వ విడత డబ్బులు పొందడాని తప్పకుండా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని సూచిస్తోంది. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.inని సందర్శించి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోండి. మీ సమీపంలోని సీఎస్‌సీ కేంద్రాన్ని సందర్శించి కూడా ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవచ్చు.


పీఎం కిసాన్ పథకంపై ఫిర్యాదులు


పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీకు ఏదైనా సమస్య తలెత్తితే హెల్ప్‌లైన్ నెంబర్ 155261 లేదా 1800115526 లేదా 011-23381092కు సంప్రదించాలి. లేదా pmkisan-ict@gov.in కు మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.


Also Read: Anakapalle Child Death: చిన్నారిని గరిటెతో కొట్టిన తల్లి.. 16 నెలల పసికందు మృతి  


Also Read: Credit Card Rules: ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్.. పెరిగిన ఛార్జీలు ఇలా..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి