PM Kisan Samman Nidhi 14th Installment Status: దేశంలో రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పీఎం కిసాన్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో ఏడాదికి రూ.6 వేల చొప్పున జమ చేస్తోంది. వాయిదాకు రూ.2 వేలు చొప్పున ఏడాదికి మూడు విడతల్లో చెల్లిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 13 విడతల్లో రైతుల ఖాతాల్లో నగదు క్రెడిట్ అయింది. 13వ విడతకు సంబంధించిన డబ్బులు ఇటీవలె కేంద్ర ప్రభుత్వం జమ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పీఎం కిసాన్ 14వ విడత డబ్బులు కూడా త్వరలోనే లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం కింద దాదాపు 9 కోట్ల మంది రైతులకు లబ్ధిపొందుతున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

14వ విడతకు సంబంధించి నిధులు మీ అకౌంట్‌లో జమ కావాలంటే కచ్చితంగా కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలి. మీరు ఇంకా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయకపోతే.. వెంటనే చేసుకోండి. వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయండి. కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారుల ఖాతాల్లో నగదు బదిలీ జరగదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నోసార్లు స్పష్టం చేసింది. కేవైసీ ప్రక్రియను గడువు కంటే పూర్ చేయకపోతే.. 13వ విడత తరహాలోనే 14వ విడత ఇన్‌స్టాల్‌మెంట్ నిధులు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. 


ఈ-కేవైసీ ఇలా పూర్తి చేయండి.. 


==> పీఎం కిసాన్ యోజన పథకం అధికారిక వెబ్‌సైట్‌ pmkisan.gov.in లోకి లాగిన్ అవ్వండి.
==> వెబ్‌సైట్‌లో రైట్ సైడ్ ఉన్న ఈ-కేవైసీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
==> మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి. 
==> మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి.
==> ఆ తరువాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి. ఆ తరువాత మీ ఈకేవైసీ కంప్లీట్ అయినట్లు మెసెజ్ వస్తుంది.


మీ పేరు ఇలా చెక్ చేసుకోండి..


==> ముందుగా మీరు PM Kisan pmkisan.gov.in అధికారిక పోర్టల్‌కి వెళ్లండి.
==> ఇక్కడ 'బెనిఫిషియరీ స్టేటస్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
==> మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా పథకానికి లింక్ చేసిన 10 అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ను చేయండి.
==> స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి.. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
==> స్క్రీన్‌పై స్టాటస్ కనిపిస్తుంది. మీ అకౌంట్‌లోకి డబ్బులు వస్తాయో రావో తెలుసుకోవచ్చు.
==> ఈకేవైసీ, అర్హత, ల్యాండ్ సీడింగ్ పక్కన మీరు రాసిన సందేశాన్ని చూడండి.
==> ఈ మూడింటిలో ఏదైనా ఒకదాని ముందు 'నో' అని ఉంటే.. మీకు వాయిదా డబ్బులు రాకపోవచ్చు. 
==> ఈ మూడింటి ముందు 'యస్' అని ఉంటే.. మీ అకౌంట్‌లో డబ్బులు జమ అవుతాయి.


Also Read: Rohit Sharma: రోహిత్ శర్మ పేరిట చెత్త రికార్డు.. కెప్టెన్‌గా దారుణమైన స్ట్రైక్ రేట్


Also Read: IPL Points Table: టాప్‌లేపిన రాజస్థాన్.. హైదరాబాద్ పరిస్థితి దారుణం.. మిగిలిన జట్లు ఇలా..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి