Rohit Sharma Worst Record: రోహిత్ శర్మ పేరిట చెత్త రికార్డు.. కెప్టెన్‌గా దారుణమైన స్ట్రైక్ రేట్

IPL 2023 Worst Records: రాయల్ ఛాలెంజర్స్‌ బెంగుళూరుతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 10 బంతులు ఎదుర్కొని కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో కెప్టెన్‌గా అతి తక్కువ స్టైక్ రేట్ నమోదు చేసిన ప్లేయర్‌గా ఓ చెత్త రికార్డు హిట్‌మ్యాన్ పేరిట నమోదైంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2023, 05:33 PM IST
Rohit Sharma Worst Record: రోహిత్ శర్మ పేరిట చెత్త రికార్డు.. కెప్టెన్‌గా దారుణమైన స్ట్రైక్ రేట్

IPL 2023 Worst Records: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ సంప్రదాయాన్ని కొనసాగించింది. 2013 నుంచి ప్రతి సీజన్‌లో మొదటి ఓడిపోతున్న ముంబై.. ఈ సీజన్‌లోనూ ఫస్ట్ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఆదివారం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్లతో తేడా ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ సేన 171 పరుగులు చేసింది. బెంగళూరు 2 వికెట్లు కోల్పోయి  172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. చాలా రోజుల తరువాత టీ20 ఫార్మాట్ ఆడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో ఓ చెత్త రికార్డును కూడా తన పేరిట రాసుకున్నాడు. ఐపీఎల్‌లో స్ట్రైక్ రేట్ అత్యంత దారుణంగా ఉన్న కెప్టెన్లలో మొదటిస్థానంలో నిలిచాడు. 

ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్‌ శర్మ.. పరుగులు తీసేందుకు చాలా ఇబ్బందిపడ్డాడు. ఆర్సీబీ బౌలర్ల కట్టుదిట్టంగా బంతులు వేయడంతో క్రీజ్‌లో నిలబడేందుకు కష్టపడ్డాడు. హిట్‌మ్యాన్ 10 బంతుల ఎదుర్కొని కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. ఇందులో ఒక లైఫ్ కూడా ఉంది. రోహిత్ శర్మ స్ట్రైక్ రేట్ 10గా ఉంది. 10 బంతులు ఆడిన తర్వాత ఐపీఎల్‌లో ఏ జట్టు కెప్టెన్‌కైనా ఇదే చెత్త స్ట్రైక్ రేట్. అంతేకాదు.. గతేడాది కూడా రోహిత్ శర్మ రెండు మ్యాచ్‌లలో ఇలాంటి ప్రదర్శనే చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్ట్రైక్ రేట్ 15.38 కాగా.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్ట్రైక్ రేట్ 25గా ఉంది. 

ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా ఐదు టైటిళ్లు గెలిచిన ముంబై ఇండియన్స్.. గత సీజన్‌లో మాత్రం దారుణంగా విఫలమైంది. పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది. 14 మ్యాచ్‌లు ఆడి.. కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. గత ప్రదర్శనను మర్చిపోయి.. ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలని ముంబై జట్టు చూస్తోంది. అయితే బుమ్రా వంటి స్టార్ బౌలర్ దూరమవ్వడంతో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న జోఫ్రా అర్చర్ తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ముంబై బౌలింగ్ యూనిట్ బలమైన ప్రదర్శన చేస్తేనే.. టోర్నీలో సక్సెస్ అవుతుంది.

Also Read: SBI Server Down: ఎస్‌బీఐ కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్.. సర్వర్ డౌన్‌తో కష్టాలు  

Also Read: IPL Points Table: టాప్‌లేపిన రాజస్థాన్.. హైదరాబాద్ పరిస్థితి దారుణం.. మిగిలిన జట్లు ఇలా..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News