కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిథి యోజన. ఈ పధకం 13వ విడత నిధుల్ని ప్రధాని మోదీ కర్ణాటకలోని బెళగావిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. నేరుగా రైతుల ఖాతాల్లో ఆ నగదు జమ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్ణాటకలోని బెళగావిలో ఇవాళ మద్యాహ్నం 3 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత నిధుల్ని విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 8 కోట్లకు పైగా లబ్దిదారులైన రైతుల ఖాతాల్లో 16,800 కోట్లు జమయ్యాయి. పీఎం కిసాన్, జల జీవన్ మిషన్ లబ్దిదారులు భారీగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింహ్ తోమర్ , వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహుజా కూడా ప్రధాని మోదీ వెంట ఉన్నారు. 


ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా లబ్దిదారులైన రైతు కుటుంబాల ఖాతాల్లో 13వ వాయిదా డబ్బులు విడుదల చేసి రైతు సోదర సోదరీమణులతో మాట్లాడతారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింహ్ తోమర్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఇవాళ అంటే ఫిబ్రవరి 27వ తేదీ మద్యాహ్నం 3 గంటలకు బెళగావిలో జరగనుందని ట్వీట్‌లో వెల్లడించారు.


పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 11వ వాయిదా 2022 మే నెలలోనూ, 12వ వాయిదా డబ్బులు 2022 అక్టోబర్ నెలలోనూ నేరుగా రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఇప్పటి వరకూ మొత్తం 2.25 లక్షల కోట్లు ఈ పధకం ద్వారా 11 కోట్లకు పైగా అన్నదాతలకు విడుదలయ్యాయి. ఇందులో 1.75 లక్షల కోట్ల రూపాయిలు కోవిడ్ మహమ్మారి కాలంలో రైతులకు అందించారు. ఈ పధకం 2019లో ప్రారంభమైంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిది యోజనలో భాగంగా ప్రతి లబ్దిదారుడైన రైతు ఖాతాలో ప్రతి నాలుగు నెలలకు 2 వేల రూపాయలు అంటే ఏడాదిలో మూడుసార్లు మొత్తం 6  వేల రూపాయలు అన్నదాతకు లబ్ది చేకూర్చే పథకమిది. 


Also read: NEET PG Exam Postponement 2023: నీట్ 2023 వాయిదా.. సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంట!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook