PM Kisan 14th Installment: PM కిసాన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు ఎప్పుడంటే..?
PM Kisan 14th Installment Update: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఇప్పటివరకు 13 విడతల్లో లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ అయింది. ఈ పథకం కింద ఏడాదికి రూ.6 వేలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. త్వరలోనే 14వ విడతకు సంబంధించి నిధులు విడుదల చేయనుంది.
UPdate on PM Kisan 14th Installment: ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు ముఖ్యగమనిక. 14వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో బిగ్ అప్‌డేట్ తెరపైకి వచ్చింది. పీఎం కిసాన్ నిధి నగదు విడుదల తేదీని కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుందని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్-జూలై మధ్య విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు. 13వ విడత నిధులు ఫిబ్రవరి 26న విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పథకం కింద 9 కోట్ల మంది రైతులు లబ్ధిపొందుతున్నారు.
పీఎం కిసాన్ స్కీమ్ కింద లబ్ధిదారులకు ఏడాదికి రూ.6 వేలను కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందజేస్తోంది. ఏడాదికి రూ.6 వేలను లబ్ధిదారుల ఖాతాలో నేరుగా జమ చేస్తోంది. రూ.2 వేల చొప్పున మూడు వాయిదాల్లో చెల్లిస్తోంది. ఇప్పటివరకు 13 విడతల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ అయింది. మీరు ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలనుకుంటే.. ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పటికే లబ్ధి పొందుతున్న వారు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి.
ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి..?
==> ముందుగా pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
==> ఇక్కడ హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఫార్మర్స్ కార్నర్‌పై క్లిక్ చేయండి.
==> కొత్త రైతు నమోదుపై క్లిక్ చేసి.. మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి.. ఆపై క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
==> క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసిన తరువాత.. “కంటిన్యూ ఇక్కడ క్లిక్ చేయండి” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
==> ఆ తరువాత కొన్ని వివరాలు మీ ముందు కనిపిస్తాయి. “యస్”పై క్లిక్ చేసి పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ఫారమ్ 2023ని పూరించండి.
==> “యస్”పై క్లిక్ చేసిన తరువాత పీఎం కిసాన్ దరఖాస్తు ఫారమ్ 2023లో అడిగిన సమాచారాన్ని పూరించండి. అనంతరం ఫారమ్‌ను సేవ్ చేసి ప్రింటవుట్ తీసుకోండి.
రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలు ఇవే..
==> ఆధార్ కార్డు
==> భూమి పత్రాలు
==> పౌరసత్వ సర్టిఫికేట్
==> బ్యాంక్ అకౌంట్ వివరాలు
==> మొబైల్ నంబర్
==> పాస్‌పోర్ట్ సైజు ఫోటో
స్టాటస్‌ను ఎలా చెక్ చేయాలి..?
==> అధికారిక PM కిసాన్ పోర్టల్‌కి వెళ్లండి
==> 'ఫార్మర్స్ కార్నర్' కింద 'లబ్దిదారుల జాబితా'పై క్లిక్ చేయండి
==> స్టేట్, డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకోండి
==> 'గెట్ రిపోర్ట్' ట్యాబ్‌పై క్లిక్ చేయండి
ఈకేవైసీనీ ఎలా అప్‌డేట్ చేయాలి..?
==> పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
==> పేజీ రైట్ సైడ్ ఉన్న ఈకేవైసీ ఆప్షన్‌నై క్లిక్ చేయండి.
==> మీ ఆధార్ కార్డ్ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి. సర్చ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి
==> ఆధార్ కార్డ్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
==> 'గెట్ ఓటీపీ'పై క్లిక్ చేసి.. మీ నంబరుకు వచ్చిన ఓటీపీని నమోదు చేసి చెక్ చేసుకోండి.
Also Read: Best Saving Schemes 2023: ఈ మూడు పథకాల్లో ఇన్వెస్ట్ చేయండి.. తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook