Best National Saving Schemes 2023: ఈ 3 పథకాల్లో ఇన్వెస్ట్ చేయండి.. తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయం పొందండి!

Best Investment Schemes 2023: మీరు ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్లాన్ చేస్తున్నారా..? తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడుతూ.. భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడేలా ఉండాలని అనుకుంటున్నారా..? అయితే ఈ మూడు పథకాల గురించి తప్పక తెలుసుకోండి. ఎంత వడ్డీ లభిస్తుంది..? నెలకు ఎంత డిపాజిట్ చేయవచ్చు..? వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 15, 2023, 09:12 AM IST
Best National Saving Schemes 2023: ఈ 3 పథకాల్లో ఇన్వెస్ట్ చేయండి.. తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయం పొందండి!

3 Best Investment Schemes 2023: ప్రస్తుత ఉరుకుల పరుగు జీవితంలో మనం ఎంత సంపాదిస్తున్నా.. నాలుగు రాళ్లు వెనుకవేసుకోకపోతే భవిష్యత్‌లో వచ్చే ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతం అవ్వకతప్పదు. కాబట్టి ఇప్పటి నుంచే మనకు వస్తున్న ఆదాయంలో ఎంతోకొంత పొదుపు చేసుకోవడం ఉత్తమం. ఇలా పొదుపు చేసిన డబ్బుతోనూ వడ్డీ ప్రయోజనాలు పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రజలను పొదుపు దిశగా ప్రోత్సహించేందుకు అనేక పథకాలను తీసుకువచ్చింది. మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు సురక్షితంగా ఉండడంతోపాటు భవిష్యత్‌లో మంచి లాభాలతో మీ చేతికి అందుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు లాభదాకమైన పథకాలు గురించి తెలుసుకోండి. 

జాతీయ పొదుపు పథకం.. 

ఈ స్కీమ్ ఐదేళ్లలో మెచ్యూర్ అవుతుంది. ఈ పథకం కింద ఒకే అకౌంట్‌లో గరిష్టంగా రూ.9 లక్షలు, జాయింట్ ఖాతాలో రూ.15 లక్షలు జమ చేయవచ్చు. ఈ పథకంలో మనం ఇన్వెస్ట్ చేస్తున్న డబ్బు మొత్తం రూ.1000 గుణిజాలలో మాత్రమే ఉండాలి. ఒక వేళ సంవత్సరం తరువాత అకౌంట్‌ను క్లోజ్ చేయాలని అనుకుంటే.. మూసివేయవచ్చు. ఖాతా ఓపెన్ చేసిన ఏడాది నుంచి మూడేళ్లలోపు మూసివేస్తే.. డిపాజిట్ చేసిన మొత్తంపై 2 శాతం తగ్గింపు ఉంటుంది. మూడేళ్లు దాటిన తరువాత అకౌంట్ క్లోజ్ చేస్తే.. డిపాజిట్‌లో 1 శాతం తీసివేస్తారు. ఈ ఖాతాలో వడ్డీ రేటు  ప్రస్తుతం 7.4 శాతంగా ఉంది.

నేషనల్ సేవింగ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్..

ఈ పథకంలో ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్లు ఇలా నాలుగు రకాల అకౌంట్లు ఉంటాయి. కనీసం రూ.1000 డిపాజిట్ చేసి.. అనంతరం రూ.100 గుణిజాలతో పొదుపు చేయవచ్చు. ఇందులో గరిష్ట డిపాజిట్‌పై లిమిట్ లేదు. మీరు ఎంతనై ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆరు నెలల తర్వాత అకౌంట్‌ను క్లోజ్ చేయవచ్చు. ఆరు నెలల తరువాత నుంచి ఏడాదిలోపు ముందుగానే విత్‌డ్రా చేస్తే.. పీఓఎస్‌ఏ సాధారణ వడ్డీ చెల్లిస్తుంది. ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80-సీ ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. ఈ పథకంలో వడ్డీ రేటు ఏడాది స్కీమ్‌పై 6.80 శాతం, రెండేళ్లకు 6.90 శాతం, మూడేళ్లకు 7 శాతం, ఐదేళ్లకు 7.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నారు.

Also Read: SRH vs PBKS Preview: సన్‌ రైజర్స్ బోణీ కొట్టేనా..? పంజాబ్ కింగ్స్‌తో ఢీ.. డ్రీమ్‌ 11 టీమ్ కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్

పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్..

ఈ పథకంలో నెలకు రూ.500 డిపాజిట్ చేస్తే సరిపోతుంది. గరిష్ట డిపాజిట్‌పై లిమిట్‌ లేదు. ఒక వ్యక్తి వ్యక్తిగతంగా లేదా ఎవరితో అయినా కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. మైనర్ తరపున కూడా ఖాతా తెరవవచ్చు. అలాగే 10 ఏళ్లు నిండిన మైనర్ కూడా స్వతంత్రంగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఖాతాలో రూ.10 వేల వరకు వడ్డీ ఆదాయపు పన్ను చట్టం కింద ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం నుంచి మినహాయింపు పొందవచ్చు. ప్రస్తుం ఈ పథకం 4 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

Also Read: Bal Jeevan Bima Yojana: రోజుకు కేవలం రూ.6 పెట్టుబడి పెట్టండి.. మీ పిల్లలను లక్షాధికారిని చేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News