PM Kisan Scheme 13th Installment Date 2023: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులకు గుడ్‌న్యూస్ రాబోతుంది. 13వ విడత నిధులు కోసం రైతులు ఎదురుచూస్తుండగా.. డబ్బలు జమ అయ్యే తేదీపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. మార్చి 8న రైతుల ఖాతాలో రూ.2 వేలను కేంద్ర ప్రభుత్వం జమ చేయనుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి అధికారిక ప్రకటన రాకపోయినా.. హోలీ కానుకగా ప్రభుత్వం గిఫ్ట్ అందించబోతుందని ప్రచారం జరుగుతోంది. ఈసారి 14 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ నగదు అందనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదేవిధంగా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన లబ్ధిదారులకు కూడా తీపికబురు అందనుంది. ఇక నుంచి ఏ రైతు కూడా భాషా సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు పంటల బీమా విషయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా కేంద్ర ప్రభుత్వం చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక నుంచి రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ యాప్, ఎన్‌సీఐ పోర్టల్‌లో హిందీ, ఇంగ్లీష్‌తో సహా 12 ప్రాంతీయ భాషల్లో పంట బీమా సంబంధిత సమాచారాన్ని పొందవచ్చని అధికారులు తెలిపారు.


ఇప్పటివరకు పీఎం కిసాన్ 12 వాయిదాల నిధులు రైతుల ఖాతాలో జమ అయ్యాయి. ఇప్పుడు రైతులందరికీ 13వ విడత డబ్బులు రావాల్సి ఉంది. అయితే ఈకేవైసీ పూర్తి చేయని రైతులకు నగదు అందదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.


లబ్ధిదారుల జాబితాలో మీరు ఇలా చెక్ చేసుకోండి..
 


==> పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.inకి వెళ్లండి 
==> హోమ్ పేజీలో 'ఫార్మర్స్ కార్నర్' ఎంపికకు వెళ్లండి. 
==> రైతుల కార్నర్ మెను నుండి లబ్ధిదారుల జాబితా ఎంపికను ఎంచుకోండి. 
==> డ్రాప్-డౌన్ మెను నుంచి రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్, గ్రామాన్ని ఎంచుకోండి. 
==> 'గెట్ రిపోర్ట్' ఎంచుకోండి. 
==> పైభాగంలో మీ పేరుతో పాటుగా లబ్ధిదారులందరి జాబితా కనిపిస్తుంది.


ఈ పథకానికి సంబంధించి మీకు ఏదైనా సమస్య తలెత్తితే హెల్ప్‌లైన్ నెంబర్ 155261 లేదా 1800115526 లేదా 011-23381092కు సంప్రదించాలి. అది కాకుండా pmkisan-ict@gov.in కు మెయిల్ చేయాల్సి ఉంటుంది.


Also Read: Jayamangala Venkataramana: మాజీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ బంపర్ ఆఫర్.. టీడీపీకి షాక్..!  


Also Read: TS Schools Summer Holidays 2023: స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటన.. ఎప్పటి నుంచి అంటే..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook