PM KISAN Money: ఉత్తరప్రదేశ్ రైతులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Scheme) పథకం కింద 10వ విడతలో భాగంగా 7 లక్షల మందికి లబ్ధి చేకూరింది. అయితే నిబంధనల మేరకు అనర్హత పొందిన కారణంగా వారందరూ వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయిన డబ్బును తిరిగి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు ఉత్తరప్రదేశ్ లోని స్థానిక వార్తాపత్రిక సంస్థలు పేర్కొన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ జాతీయ వార్తా సంస్థ ప్రకారం.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద లబ్ధి పొందిన దాదాపు 7 లక్షల మంది రైతులను అనర్హులుగా ప్రకటించినట్లు తెలుస్తోంది. వీరంతా ఎక్కువ సంపాదనతో ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని విచారణలో తేలింది. దీంతో ఈ పథకానికి అప్లే చేసిన వారంతా డబ్బును తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది.


"ఆదాయపు పన్ను కట్టే వాళ్లు సహా ఎక్కువ సంపాదన కలిగిన రైతులను ఈ పథకానికి అనర్హులు అవుతారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు పీఎం కిసాన్ పథకం కింద పొందిన డబ్బును తిరిగి ఇచ్చేందుకు సమయం ఉంటుంది. ఆ లోపు వారు పొందిన డబ్బును స్వచ్ఛందంగా తిరిగి ఇవ్వకపోతే నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది" అని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. 


ప్రధానమంత్రి కిసాన్ పథకం..


ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో ఏడాదికి రూ.6 వేల జమ అవుతాయి. ఆ డబ్బును మూడు విడతలుగా రైతు బ్యాంకు ఖాతాలో విడుదల చేస్తారు. నాలుగు నెలలకు ఒకసారి ప్రతి విడతగా రూ.2 వేలను రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 10వ విడతకు చెందిన డబ్బును జనవరి 1న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ విడుదల చేశారు. 


Also Read: Delhi Corona Update: ఢిల్లీలో లాక్‌డౌన్ విధించనున్నారా..డీడీఎంఏ కీలక భేటీ నేడే


Also Read: Covid-19 Updates: షాకింగ్ న్యూస్.. 300 మంది పోలీసులకు కరోనా పాజిటివ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook