PM Kisan Scheme: అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం..12వ విడత ఎప్పుడంటే..!
PM Kisan Scheme Update: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 12వ విడత పీఎం కిసాన్ యోజన నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
PM Kisan Scheme Update: తమది రైతు ప్రభుత్వమని ప్రధాని మోదీ మరోమారు స్పష్టం చేశారు. దేశంలో కోట్లాది మంది రైతులు ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ యోజన 12వ విడత సాయాన్ని ఈనెలలోనే విడుదల చేయనున్నామని తెలిపారు. అన్నదాతల ఖాతాల్లో రూ.2 వేల నిధులు జమ కానున్నాయి. రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈపథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏటా మూడు విడతల్లో నిధులను జమ చేస్తోంది.
ఈనెల 30 నాటికి రైతుల ఖాతాల్లో రూ.2 వేల రూపాయలు జమ కానుంది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ అధికారుల నుంచి సమాచారం అందుతోంది. అకౌంట్‌లో డబ్బు వచ్చిందా..ఇన్ స్టాల్ మెంట్ స్టేటస్‌ను కింది విధంగా చెక్ చేసుకోండి..
* మొదటి పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్ సైట్(https://pmkisan.gov.in)లోకి వెళ్లాలి.
* హోమ్ పేజీలో ఫార్మర్ కార్నల్ ఆప్షన్ వద్దకు వెళ్లాలి..అందులో లబ్ధిదారుడి స్టేటస్ అనే ఆప్షన్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
* ఆ తర్వాత ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
* అందులో రైతు నుంచి కోరిన సమాచారాన్ని నింపాలి..అనంతరం సబ్మిట్ బటన్‌పై నొక్కాలి.
* ఆ తర్వాత లబ్ధిదారుడి స్థితి ఓపెన్ అవుతుంది.
* ఇందులో రైతులకు వాయిదా వచ్చిందా..లేదా అన్న సమాచారం తెరుచుకుంటుంది.
* పై విధంగా పీఎం కిసాన్ 12వ విడత నిధుల స్టేటస్‌ను చూడవచ్చు.
పథకంపై ప్రధాని మోదీ స్పందన..!
పీఎం కిసాన్ పథకం వల్ల కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారని ప్రధాని మోదీ చెప్పారు. ఈపథకంతో రైతుల ఆదాయం పెరుగుతోందన్నారు. అదే సమయంలో వ్యవసాయాభివృద్ధి జరుగుతోందని తెలిపారు. రైతు ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈపథకాన్ని తీసుకొచ్చింది. పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఏటా రూ.6 వేలు ఇవ్వనున్నారు. ఏడాదిలో మూడు విడతలుగా నిధులను జమ చేయనున్నారు.
పీఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరంటే..!
ఇందుకు కేవైసీ తప్పనిసరి చేశారు. ఈపథకం కేవలం అన్నదాతలకే వర్తించనుంది. పట్టా ఉన్న ప్రతి ఒక్క రైతు లబ్ధి పొందనున్నాడు. కౌలు రైతుకు లబ్ధి చేకూరదు. వీరితోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీర్లు, సీఏలు, ఆర్కిటెక్టులు, లాయర్లు వంటి ప్రొఫెషనల్స్, రిటైర్డ్ ఉద్యోగులు సైతం వ్యవసాయం చేసినా..పీఎం కిసాన్ పథకం వారికి వర్తించదని అధికారులు స్పష్టం చేశారు.
Also read:SBI Jobs: బ్యాంక్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు శుభవార్త..!
Also read:TS Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..త్వరలో మరో నోటిఫికేషన్..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook