PM Kisan Samman Nidhi Yojana 12th Installment: ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మా న్ నిధి యోజన 12వ విడత డబ్బులకు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. పీఎం కిసాన్ (PM Kisan) పథకం డబ్బులు ఇవాళ అంటే సెప్టెంబరు 30, శుక్రవారం లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని ఊహగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం ఇప్పటి వరకు తెలియలేదు. రైతులు మే 31న పీఎం-కిసాన్ పథకం 11వ విడత డబ్బులు అందుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) పథంలో భాగంగా రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6000 ఇస్తుంది. ఈ మెుత్తాన్ని మూడు విడతల్లో అందిస్తోంది. అంటే ప్రతి నాలుగు నెలలకొకసారి రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున జమ చేస్తోందన్న మాట. ఈ పథకాన్ని మోదీ సర్కారు 2019లో ప్రవేశపెట్టింది. ఈ డబ్బుల మీ అకౌంట్లో పడాలంటే ఈకేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం ఇదివరకే సూచించింది. 


చెక్ చేసుకోండి ఇలా..
>> ముందుగా pmkisan.gov.in ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి – 
>> ఇప్పుడు హోమ్‌పేజీలో ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ కు వెళ్లండి
>> అనంతరం 'బెనిఫిషియరీ స్టేటస్' ఎంపిక చేసుకోని మీ అప్లికేషన్ స్టేటస్ ను చెక్ చేసుకోండి.
>> లిస్ట్ లో రైతు పేరు మరియు అతని బ్యాంకు ఖాతాకు పంపిన మొత్తం ఉంటుంది.
>> ఇప్పుడు మీ ఆధార్ నంబర్ లేదా ఖాతా నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. 
>> ఆపై '‘Get data' అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.


Also Read: AP TET Results 2022: ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండి ఇలా...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook